Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

సెమీఫైనల్లో పాక్

  • 3 వికెట్ల తేడాతో లంకపై పాకిస్థాన్ విజయం

Sarfraz-Ahmed

కార్డిఫ్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన గ్రూపు-బి మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 3 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్లో పాక్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 237 పరుగుల విజయ లక్షంతో బరిలోకి దిగిన పాక్ 44.5 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి లంకేయులపై గెలు పొందింది. ఈ మ్యాచ్ లో విజయంతో పాక్‌కు రెండు పాయింట్లు లభించాయి. దీంతో బుధ వారం జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. అలాగే రెండో సెమీ ఫైనల్లో గురువారం భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
తడబడి తేరుకున్న పాకిస్థాన్
237 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఆదిలో వెనువెంటనే వికెట్లు కోల్పయిన పాక్ తడబడి నెమ్మదిగా తేరు కుంది. పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన పాక్‌ను అదుకున్న కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (79 బంతుల్లో 5 ఫోర్లు) 61 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సర్ఫరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. పాక్‌ను కట్టడి చేయడంలో లంక బౌలర్లు విఫల మయ్యారు. ఓపెనర్ ఆటగాళ్లు మంచి శుభారం భాన్ని అందించారు. అజార్ అలీ (34) పరుగు లు చేయగా, ఫాఖార్ జామన్ (36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) 50 పరుగులు సాధించి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఒక దశలో అజార్ దూకుడుకు ప్రదీప్ కళ్లెం వేయడంతో గురురత్నెకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అతని స్థానంలో వచ్చిన బాబర్ అజామ్ (10) పరుగులకే చేతులేత్తేయ గా, మహ్మద్ హాఫీజ్ పేలవ ప్రదర్శనతో (1) పరుగుకే మూడో వికెట్ రూపంలో నిష్క్రమిం చాడు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన అజార్ అలీ (50 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) 34 పరుగులు చేసి లక్మల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన షోయబ్ మాలిక్‌కు ఈ మ్యాచ్ 250వ వన్డే మ్యాచ్ కాగా, కేవలం 11 పరుగులు మాత్రమే సాధించి మలింగ బౌలింగ్‌లో డిక్వె ల్లాకు క్యాచ్ ఇచ్చి చేతులేత్తేశాడు. అనంతరం ఇమాద్ వశీం (4) ఆరో వికెట్‌గా పెవిలియన్ బాటపట్టాడు. ఫహీమ్ అష్రఫ్ (15) పరుగులు చేసి పెరీరా బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు. పాక్‌ను ఆదుకునే క్రమంలో జట్టు కెప్టెన్ సర్ఫ రాజ్ అహ్మద్ (61), మహ్మద్ అమిర్ (28) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. లంక బౌలర్ల లో ప్రదీప్ మూడు వికెట్లు తీసుకోగా, మలింగ, లక్మల్, పెరీరా తలో వికెట్ తీసుకున్నారు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.2 ఓవర్లలో 236 పరుగులు చేసి కుప్పకూలింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లంక ఆటగాళ్లలో డిక్వెల్లా (86 బంతుల్లో 4 ఫోర్లు) 73 పరుగులతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఓపెనర్‌గా లంకకు మంచి శుభారంభాన్ని అందించిన డిక్వెల్లా నెమ్మదిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిం చాడు. అయితే ఒక దశలో డిక్వెల్లా దూకుడికి పాక్ బౌలర్ మహ్మద్ అమిర్ తన బౌలింగ్‌తో బ్రేక్ వేశాడు. దీంతో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. లంక జట్టులో డిక్వెల్లా మినహా మిగతా ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో అశించిన స్థాయిలో రాణించలేకపోయారు. లంక సారథి మ్యాథూస్ (39) పరుగులు చేయగా, గురు రత్నె (27), లక్మల్ (26), మెండీస్ (27), గుణతిలక (13) పరుగులు చేయగా, మలింగ నాటౌట్ (9), సిల్వా, ప్రదీప్, పెరీరాలు ఒక పరుగుకే చేతులేత్తేశారు. పాక్ బౌలర్లు లంక ఆటగాళ్లను అద్భుతమైన బౌలింగ్ శైలితో కట్టడి చేయడంతో 236 పరుగులకే ఆలౌటై మ్యా థూస్ సేన కుప్పకూలింది. దీంతో లంక జట్టు పాక్‌కు 237 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశిం చింది. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్, హసన్ అలీ మూడు వికెట్లు, మహ్మద్ అమిర్, ఫహీమ్ అష్ర ఫ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

Comments

comments