Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

విహారయాత్రలో విషాదం..!

Person-Drown-In-Ganga

న్యూఢిల్లీ : సరదాగా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు ఈత రాకుండా నీళ్లలో మునిగిపోతుంటే కాపాడల్సింది పోయి.. మిగితా స్నేహితులు వీడియో తీస్తూ ఉండిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హృషికేశ్‌లో చోటు చేసుకుంది.

ఢిల్లీకి చెందిన కుందన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. స్నేహితులందూ రాఫ్టింగ్ కు వెళ్లదామని అన్నప్పటికి కుందన్ గంగ నదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో కుందన్‌.. తాను నదిలోకి దిగుతున్నప్పుడువీడియో తీయమని స్నేహితులకి ఫోన్‌ ఇచ్చాడు. అతనికి ఈతరాకపోవడంతో తాడుపట్టుకుని నదిలో దిగాడు. స్నానమాచరిస్తుండగా కుందన్‌ ఒక్కసారిగా మునిగిపోయాడు. ఆ సమయంలో కుందన్ ఈత రాకుండా అల్లడుతుంటూ అతడి స్నేహితులు మాత్రం అదేం పట్టనట్టు వీడియో తీసుకుంటూ ఉండిపోయారు. దీంతో కుందన్ పూర్తిగా మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కుందన్ మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

comments