Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ధావన్

  • 1000 పరుగుల మార్కును చేరిన భారత ఓపెనర్

Dhawan

లండన్ : భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య ఆదివారం జరిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో ధావన్ హాఫ్ సెంచరీ నమోదు చేసి వెయ్యి పరుగుల మార్కును సాధించాడు. ఇప్పటివరకూ ఐసిసి వన్డే మ్యాచ్‌లలో 18 ఇన్నింగ్స్‌లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వెయ్యి పరుగుల రికార్డును తాజాగా ధావన్ బద్దలు కొట్టేశాడు. దీంతో ఐసిసి వన్డే టోర్నమెంట్లలో అత్యధిక వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా ధావన్ చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో ఆడిన వన్డే మ్యాచ్‌లలో కేవలం 16 ఇన్నిం గ్స్‌లు మాత్రమే ఆడిన ఎడమచేతి వాటం ఆటగాడిగా ఈ ఫీట్‌ను సాధించాడు. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2017 లో 68, 125, 78 పరుగులు చేసిన ధావన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు సాధించడంతో ఈ మార్కును అందుకున్నాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత ఎడిషన్ ఛాంపియన్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంటు ధావన్ దక్కించుకున్నాడు. భారత ఆటగాడిగా ఆడిన 5 మ్యాచ్‌ల్లో 363 పరుగులు సాధించి 90.75 సగటుతో నిలవ గా, అతని ఇన్నింగ్స్‌లు కలిపి రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు.

Comments

comments