Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

నవ్వండహే…

Thief

సాధరణంగా దొంగలు దోపిడీకి వచ్చేటప్పుడు వచ్చేది దొడ్డీ దారినే అనేది అందిరికీ తెలిసిన సత్యమే. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేపి పక్షంలో తలపులకు వేసిన తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశిస్తుంటారు. కాని ఈ వీడియోలోని దొంగ ఓ గ్యారేజీలో దొంగతనానికి ప్రయత్నించిన తీరు అందరికీ నవ్వులు పూయిస్తోంది. ముసుగు ధరించిన ఆ దొంగ గ్యారేజీకి తలపులు లేకపోవడంతో కిటీకిని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాలనుకున్నాడు.

అయితే కిటికీలకు ఓ చెక్క లాంటిదాన్ని అడ్డం పెట్టడంతో దానిని వంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. కొద్ది సేపటికి కిటికీని పగలకొట్టి లోపలికి వెళ్లిన అతడికి దిమ్మతిరిగి బొమ్మ కనబడినంతా పనైంది. గ్యారేజీ మొత్తం ఖాళీగా ఉండడంతో పాటు ముందర వైపు పూర్తిగా తెరిచి ఉంది. దాంతో దొంగ చేసేదేమిలేక ఖాళీ చేతులతో ఊసురోమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారందరూ దుండగుడి దొంగతనం తీరును చూసి కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. మీరూ ఓసారి ఈ వీడియో చూసి సరదాగా నవ్వుకోండి.

Comments

comments