Search
Thursday 27 July 2017
  • :
  • :
Latest News

‘ఐ’య్యయ్యో.. కంట్లో 27 లెన్స్‌లు

Lenseలండన్ : నలుసు పడితేనే కన్ను కలుకుమంటుంది. అలాంటిది బ్రిటన్‌లో ఓ మహిళ కంటిలో ఏకంగా 27 కాంటాక్టు లెన్స్‌లు ఉన్నట్లు గుర్తించారు. అది కన్నా? లేక కంటి అద్దాల షాపా? అనుకోవల్సివచ్చింది.రతీయ సంతతికి చెందిన రూపాల్ మొర్జారియా బర్మింగ్ హామ్‌లో నేత్రవైద్యురా లిగా శిక్షణలో ఉన్నారు. తన వద్దకు వచ్చిన 67 సంవత్సరాల మహిళకు కంటి పరీక్ష నిర్వహిస్తుండగా తొలుత ఆమె కంటిలో 17 కాంటాక్టు లెన్స్‌లు ఉన్న ట్లు గుర్తించారు. తరువాత తరచి చూడగా మరో పది ఉన్నట్లు జాడ తెలిసిం ది. ఓ కంటిలో ఇన్ని కాంటాక్టు లెన్స్‌లు ఇమిడి ఉండటం ఇంత వరకూ తాము చూసి ఉండలేదని ఈ ట్రైనీ వైద్యురాలు ఆప్టోమెట్రీ టుడేలో ఓ వ్యా సంలో తెలిపారు. కాంటాక్టు లెన్స్‌లు అన్నీ కలిసిపోయి ఉన్నాయని, అయి నా ఇప్పటివరకూ ఆమె ఎందుకు వీటి గురించి తెలిసిరాలేదనేది ఆశ్చర్యం గా ఉందని తెలిపారు. కంటిపొర ఉందని తాను అనుకుంటూ వస్తున్నానని, ఏదో నీలం పొర ఉందని భావిస్తూ వచ్చానని ఈ మహిళ తెలిపింది. కాటా రాక్ట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఆమెకు కాంటాక్ట్ లెన్స్‌ల సంగతి తెలిసివచ్చింది.

Comments

comments