Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

పడవ మునిగి 27 మంది విద్యార్థులు మృతి

Boat-Accidentకిన్స్‌హస : కాంగోలో ఆదివారం  ఓ పడవ నదిలో మునిగిన దుర్ఘటనలో  27 మంది మృతి చెందారు. మరో 54 మంది జాడ తెలియడం లేదు. మృతులలో అత్యధికులు విద్యార్థులే.  ఆదివారం కసాయ్ నదిలో కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్లుతున్న పడవ అదుపు తప్పి మునిగిపోయిందని, సెలవుపై ఉన్న విద్యార్థులు విహార యాత్రకు వెళ్లుతున్నారని, మధ్యలో పడవ మునిగిందని స్థానిక అధికారి జాక్వెస్ ఎంబిలా తెలిపారు. గురువారం రాత్రి ఇడియోఫా ప్రాంతంలో  ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి ఆలస్యంగా సమాచారం అందిందని వివరించారు.  మోతాదుకు మించి ప్రయాణికులు ఉండటం, పడవను నడుపుతున్న వారు తాగి ఉండటం వల్లనే , అదుపు తప్పిందని వెల్లడించారు. మృతులలో ఇద్దరు సన్యాసినులు కూడా ఉన్నారని స్థానిక రేడియో వార్తలలో తెలిసింది.

Comments

comments