Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

వెంకటేష్ కుమార్తెతో అఖిల్ పెళ్లి..?

Venkatesh-with-Akhil

హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, శ్రేయా భూపాల్‌తో వివాహం నిశ్చయమై కొన్ని కారణాల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. అనంతరం శ్రేయాకు ఓ ఎన్‌ఆర్‌ఐతో పెళ్లి కుదిరిందంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం ఇలాంటి వార్తలే అక్కినేని అఖిల్‌పై కూడా వస్తున్నాయి. వరుసకు మామయ్య అయ్యే విక్టరీ వెంకటేష్ అమ్మాయిని అఖిల్ పెళ్లాడానున్నాడనేది ఈ వార్తల సారాంశం.

ఇక అఖిల్ పెళ్లి వార్తకి సంబంధించి ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ కాని, అటు అక్కినేని ఫ్యామిలీ కాని ఎలాంటి ప్రకటన చేయలేదు. కావున ప్రస్తుస్తానికైతే వీటిని కేవలం పుకార్లుగానే పరిగణించాల్సిందే.  ప్రస్తుతం అఖిల్ విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఇక నాగార్జున పెద్ద కుమారుడు హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల వివాహం అక్టోబర్ 6న గోవాలో జరగనున్న విషయం విదితమే.

Akkineni Akhil will marry Hero Venkatesh’s Daughter?

Comments

comments