Search
Friday 20 April 2018
  • :
  • :

కోదండరాంతో కలసి పోరాడుతాం

మంచిర్యాల జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో చాడ

                  CPI-Chada-Venkat-Reddy

మంచి ర్యాల ప్రతినిధి : తెలం గాణలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై తెలం గాణ జెఎసి చైర్మన్ కోదండరాంతో పాటు కలసి వచ్చే ప్రజా సంఘా లతో పోరాటాలు చేపట్ట గలమని సిపిఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సిఎ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా సమగ్ర అభివృద్ధిపై సదస్సు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా సాధిం చిందేమి లేదని, కొలువులు రాలేదు. ప్రజల బతుకులు మారలేద న్నారు.

మూడేళ్ల పరిపాలనలో సిఎం కెసిఆర్ ఏమి సాధించారని ప్రశ్నిం చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన జెఎసి చైర్మన్ కోదండ రాం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతుంటే కెసిఆర్ అతన్ని శత్రువులా చూస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తం గా 31జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి సదస్సులు నిర్వహించి, వచ్చే నెల 1వ తేదీన సిఎంకు డిక్లరేషన్ ఇవ్వగలమని, త్వరలోనే స్పందించకపోతే ప్రజా ఉద్య మాలు చేపట్టగలమని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్, జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ధర్ని సత్యనారాయణ, కుమారస్వామి, వెంకటస్వామి, పూర్ణిమా, బానుదాస్ పాల్గొన్నారు.

Comments

comments