Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

నేడు దొడ్డి కొమురయ్య వర్థంతి

                    Doddi-Komuraiah

దేవరుప్పుల:భూమి కోసం.. భూక్తి కోసం..బానిస బంధాల నుంచి విముక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొము రయ్య. నైజాం దేశ్‌ముఖ్‌ల కుట్రలతో చిందిన కొమురయ్య రక్తంతో తెలంగాణ రక్తసిక్తమైంది. బాంచెన్ దొర కాల్మొక్తా అంటూ దొర పెత్తనం లో నలిగిన వాళ్ల ను బందూకులు చెత బట్టి పోరాడే దిశగా నడిపించిన ధీరుడు దొడ్డి కొము రయ్య. దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో 1928లో దొడ్డి గట్టమ్మ, కొండయ్య దంపతులకు దడ్డి కొమురయ్య జన్మించాడు.

కొమురయ్య 16వ ఏట 1944లో కొమురమ్మతో వివాహాం జరిగింది. ఈ క్రమంలో పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని 60 గ్రామాలను దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి , ఆయన భార్య జానమ్మ దొరసాని, కుమారుడు బాబు దొర ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ అన్ని రకాలుగా పీడించే వారు. ప్రజల మాన, ప్రాణ చేలగాటమాడువారు.1943లో జరిగిన ఆంద్రమహాపభలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడాలని ఉద్యమకారులు నిర్ణయించుకున్నారు.

కడవెండి గ్రామానికి చెందిన నల్ల నర్సింహులు, దొడ్డి కొమురయ్య, దావిద్ రెడ్డి, వడ్డె నర్సయ్య, నల్ల కొండయ్య, మచ్చ రామయ్య, జంపాల లింగయ్య, పంతం లచ్చయ్య, పాముకుంట్ల ముత్తిలింగం, మాశెట్టి రాంచంద్రయ్య, ఎర్రంరెడ్డి రాంకృష్ణారెడ్డి, పైండ్ల యాదగిరి తదితరులు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఈ ప్రాంతం నుంచి ఊపిరి ఊదారు. బానిస సంకేళ్ళతో విసిగివే సారిన జనం తిరగబడ్డ చరిత్ర.. ఎంతో మంది తమ ప్రాణాలను లెక్కచేయ కుండా పోరాడిన త్యాగ చరిత్ర.. ప్రపంచంలోని పీడిత ప్రజల్లో ఉద్యమస్పూర్తిని రగిల్చింది. కడవెండిలో నిజాం నిరంకుశ పాలనను వ్యతిరెకిస్తూ జానమ్మ దొరసాని దాష్టికాలకు స్వస్తి పలికేందుకు పీడిత ప్రజలు ఎర్రజెండా నీడలో పోరు సలిపారు. భూమి కోసం..భూక్తి కోసం…వెట్టి చాకిరి విముక్తి కోసం… ఆనాడు కడవెండిలో అంకురార్పణ జరిగిన పోరాటాల చరిత్రను రష్యా సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచారు.

గ్రామంలో జానమ్మ ఆగడాలు…

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో అత్యదిక భూములు దొర ఆదినం లో ఉండేవి. విస్నూరు దేశ్‌ముఖ్ తల్లి జానమ్మ కడవెండినే కేంద్రంగా చేసుకొని గ్రామంలో తన హింసాకాండాను కొనసాగించింది. భూములను ఆక్రమించు కోవడం, కూలీలతో వెట్టి చాకిరి చెయించుకోవడం, తన మాట వినని వారిని చంపించడం, మహిళలను అవమానించడం, పన్నుల పేరుతో దోచుకు నేది. ఈ పర్యవసానంలోనే ఆంధ్ర మహసభ అవిర్బవించింది. గ్రామంలోని నల్ల నర్సిం హులు, ఎర్రంరెడ్డి కొండల్ రెడ్డితో పాటు గుంటూరు నుంచి వచ్చిన కొందరు సెటిలర్లు ఈ సంఘాలకు ప్రాతినిధ్యం వహించి దొరకు ఎదురు తిరిగేవారు.

దొడ్డి కొమురయ్య వీరమరణం…

                     Doddi-Komuraiah-3

గొల్ల కులానికి చెందిన దొడ్డి మల్లయ్య సంఘంలో చురుకైన కార్యకర్త అతడి తమ్ముడే దొడ్డి కొమురయ్య. 18 వయసున్న ఈ యువకుడికి దొరసాని చర్యల ంటే రక్తం మరిగేది. ఆ రోజు 1946 జూలై 4 సంఘపోళ్లు దొరసాని , ఆమె గుండాల చర్యలకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆంధ్రమ హసభకు జై.. కమ్యూనిస్టుకు జై… అంటూ నినాదాలు చేశారు. అప్పుడే గొర్రెల ను దొడ్డిలో తోలి కాళ్లూ చేతులు కడుక్కొని వదిన అన్నం పెట్టగా తింటు న్న కొమురయ్య వదిన అన్న ఎటు పోయిండు అని అడిగాడు. సంఘపోళ్లు తీసుకుపోయిండ్రు అని చెప్పగాఅంతలోనే నినాదాలు అతని చెవికి తాకాయి. అన్నం వదిలి అన్నకు రక్షణగా పోతానంటూ వదినకు చెప్పి గుతప పట్టుకొని కచ్చీరు కాడికి చేరాడు. జులూస్‌లో అన్న దొడ్డి మల్లయ్య, కొమురయ్య ముందు వరుసలో ఉంటూ దొరకు వ్యతికేకంగా నినిదాలు చేస్తున్నారు. దీంతో దొరసాని జానమ్మ, ఆమే గూండాల గుండెలు గుబేలుమన్నాయి. జానమ్మ తనను ఏం చేస్తారోనని భయపడి గడి నుంచి మిస్కిన్ అలీ తో కాల్పులు జరిపించింది. దీంతో ముందు వరుసలో ఉన్న కొమురయ్య పొట్టలో బుల్లెట్లు దిగాయి. పేగులు బయటకు వస్తుండగా ఎడమ చేతితో వత్తుతూ ఆంధ్ర మహసభకు జై అంటూ నినిదాలు చేస్తు నేలకొరిగాడు. మరో బుల్లెట్ తన అన్న మ్ల్లయ మోకాలుకు తాకగా మరిన్ని బుల్లెట్లు అదే గ్రామానికి చెందిన సంఘం సభ్యులు రేషపల్లి కొం డయ్య, రేషపల్లి లక్ష్మీనర్సయ్య తలభాగంలో తాకాయి. గూం డాలు నశించాలి, తుపాకు లు మమ్మల్ని ఏమీ చేయలే వంటూ నినాదాలు చేశారు. కొము రయ్య అక్కడికక్కడే మృతి చెందగా వీరుడిగా ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచాడు.

ఉద్యమానికి ఊపిరిపోసిన కొమురయ్య అమరత్వం…

దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటా నికి ఊపిరి పోసింది. కొము రయ్యమరణంతో జానమ్మ దొర సాని వ్యవసాయ పనికి గానీ, ఇంటి పనికి గానీ, ఎవరూ పో వద్దని ఆంధ్రమహసభ పిలుపునివ్వడంతో ఆనాడే సహయనిరాకరణ మొద లైంది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా ఎవరూ పనికి రావద్దని సంఘపోళ్లు అనడంతో దొరసాని వ్యవసాయం పడావుపడింది. దీంతో జానమ్మ తిరిగి విస్నూరు వెళ్లిపోయింది. ఆ తర్వత సంఘ కార్యక్రమాలు ఉదృతమై మరో పోరాటానికి నాంది పలికాయి.

నేడు కడవెండికి కమ్యూనిస్టు పార్టీల అగ్రనాయకుల రాక…

నేడు కడవెండి గ్రామానికి పలు కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు రానున్నట్లు మండల సిపిఐ కార్యదర్శి బిళ్ల తిరుపతి రెడ్డి తెలిపారు. నేటి 71వ దొడ్డి కొము రయ్య వర్దంతి మహాసభకు అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజవంతం చేయాలని కోరారు.

Comments

comments