Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

మంత్రి కొడుకూ మత్తిల్లాడు?

నేతల కుమారులకూ డ్రగ్స్ ఇచ్చానని కెల్విన్ చెప్పినట్లు సమాచారం

Drugs

హైదరాబాద్ : డ్రగ్స్ వినియోగం లో ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను మాత్రమే బహిర్గతం చేసిన ప్రధాన నిందితుడు కెల్విన్ ఆదివారం కొంత మంది రాజకీయ నేతల కుమారుల పేర్లను వెల్లడించినట్లు తెలిసింది. నలుగురు నేతల కుమారులు తన వద్ద రెగ్యులర్ కస్టమర్లని, వారి స్నేహితులు కూడా డ్రగ్స్ సేవిస్తారని వెల్లడించినట్లు సమాచారం. కెల్విన్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిట్ బృందం ఆదివారం విచారించింది. వీరి లో మాజీ మంత్రుల తనయులున్నట్లు సమాచారం. తాజా మంత్రులలో ఒకరి కుమారుడు కూడా ఉన్నాడని అంటున్నారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ఉన్న ఒక మహిళతో పాటు పబ్బుల్లో వాటాదారులుగా ఉన్న మరో ఇద్దరి పేర్లు కూడా వెల్లడయ్యాయి. సినీ ప్రముఖులకు నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ తాజాగా కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. కెల్విన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారన్న అనుమానంతో కొంత మందిని అధికారులు విచారించారు. బెండెన్‌మెన్ ద్వారా తనకు సినీ రంగంలోని వారు పరిచయమయ్యారని, ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా తనకు పరిచయమయ్యారని కెల్విన్ దర్యాప్తు అధికారులకు తెలిపాడు. ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ను ఆర్డర్ చేసి హైదరాబాద్‌కు తెప్పించినట్లు కెల్విన్ వెల్లడించిన నేపథ్యంలో ఇందుకోసం వాడిన వెబ్‌సైట్ వివరాలను సేకరించిన అధికారులు ఆ కోణంలో దర్యాప్తును చేపట్టాలని నిర్ణయించారు.డ్రగ్స్ విక్రయంతో సంబంధం ఉన్న కొంత మంది అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు గుర్తించిన అధికారులు వారి కోసం వేటను తీవ్రం చేశారు.
ముగిసిన కెల్విన్ కస్టడీ : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్, కుద్దూస్, వాహెద్‌ల ఎక్సైజ్ కస్టడీ ముగిసింది. న్యాయవాది సమక్షంలో కెల్విన్‌ను విచారించడంతో అతడు అధికారులకు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోయాడు. దీంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరాలని అధికారులు నిర్ణయించారు. మరో పక్క ఇదే కేసులో అరెస్టైన కుందన్‌సింగ్, అమన్ నాయుడు, నిఖిల్‌శెట్టి, బెండెన్‌మెన్‌లను కస్టడీకి ఇవ్వాలని కోర్టును సోమవారం కానీ మంగళవారం కానీ కోరనున్నారు. కెల్విన్ విచారణలో కొంత సమాచారం లభించినప్పటికీ పూర్తి స్థాయిలో రాబట్టలేకపోయామని అధికారులు అంటున్నారు. తాజా విచారణలో మరో ఎనిమిది మంది పేర్లను క్యాల్విన్ వెల్లడించినట్లు సమాచారం. జర్మ నీ, నెదర్లాండ్స్ నుంచి ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు, గోవా నుంచి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్లు అంగీకరించాడని సమాచారం.
పియూష్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం : డార్క్ వెబ్‌సైట్ ద్వారా జర్మనీ, బ్రిటన్ నుంచి ఎల్‌ఎస్‌డి డ్రగ్స్‌ను తెప్పించి సొంతంగా రాకెట్‌ను నడిపిస్తున్న పియూష్ వ్యవహారంలోనూ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. వేర్వే రు విభాగాలలో డ్రగ్స్‌ను ఎలా తయారు చేయాలన్న అంశంపై ఆన్‌లైన్‌లో శోధించిన పియూష్ వాటిని తయారు చేసి వేర్వేరుగా విక్రయించినట్లు ఇప్పటికే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. పియూష్ ముఠాలో ఎంత మంది ఉన్నారు, ఆయన వద్ద ఎవరెవరు ఏ కేటగిరి డ్రగ్స్‌ను కొనుగోలు చేశారు, వాటిని ఎవరెవరు వినియోగించారన్న అంశంపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. పియూష్ వయాగ్రాను తయారు చేసి విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి కావడంతో ఏయే విభాగాలలో డ్రగ్స్‌ను వాడాడు, అందుకోసం ఏయే పదార్థాలను వినియోగించాడన్నఅంశంపై అధికారులు దృష్టి పెట్టా రు. పియూష్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఏమైన డ్రగ్స్ విక్రయించాడా? ఏ కేటగిరి డ్రగ్స్ విక్రయించాడన్న అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments