Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

30 కల్లా జిఎస్‌టిలో నమోదు

  • ప్రభుత్వం ఆదేశం
  • రూ. 20 లక్షల కన్నా తక్కువ టర్నోవరున్న వ్యాపారులకు మినహాయింపు

GST

న్యూఢిల్లీ : వస్తు,సేవల పన్ను(సిఎస్‌టి) విధానం కింద జులై 30కల్లా వ్యాపారులు నమోదు కావాలని ప్రభుత్వం శనివారం ఆదేశించింది. అయితే రూ. 20 లక్షల కన్నా తక్కువ టర్నోవరు ఉన్న వ్యాపారులు లేక ఇప్పటికీ కొత్త పన్ను విధానం కింద నమోదు కాకుండా కేవలం వస్తు వులు, సేవలు మాత్రమే అందిస్తున్నవారికి మినహాయిం పు ఉంది. ‘జిఎస్‌టి చట్టాల ప్రకారం 2017 జులై 30 కల్లా రిజిస్ట్ట్రేషను చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వర్తకులందరూ రిజిస్ట్రేషను చేసుకోవాలి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో కోరింది. జిఎస్‌టి కింద రిజిస్టర్డు అయితే కలిగే లాభాలను పేర్కొం ది. వాల్యూ చెయిన్‌కు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ బదిలీ చేస్తామని, రాబట్టిన పన్నులు ప్రభుత్వ ఖజానాకు వస్తా యని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కనుక వర్తకులు వెంటనే జిఎస్‌టి కింద ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషను చేసుకోవాలిని సూచించింది. రూ. 20 లక్షల టర్నోవరు (రూ. 10 లక్షల ప్రత్యేక క్యాటగిరి రాష్ట్రాలు) ఉన్న వ్యాపా రాలకు జిఎస్‌టి నుంచి మినహాయింపును ఇచ్చారు. ‘ఒకవేళ ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా రూ. 20 లక్షలకు పైగా టర్నోవరు వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే వారు పన్ను వర్తించే సరఫరాలు చేస్తున్నారో ఆ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో రిజిస్ట్రేషను చేసుకోవలసి ఉంటుం ది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎక్సైజ్, వ్యాట్ లేక సేవల పన్ను చెల్లిస్తున్నవారు ఇప్పటికే జిఎస్‌టిఎన్ పోర్టల్‌కు మారి ఉంటే, వారికి తాత్కాలిక ఐడి జారీ అయి ఉంటే వారు 2017 సెప్టెంబర్ 22కల్లా రిజిస్ట్రేషన్ ప్రక్రి యను పూర్తి చేయాలి. అన్ని దస్తావేజులను ఇచ్చాకే జిఎస్‌టిఎన్ ఇవ్వడం జరుగుతుంది. జిఎస్‌టి విధానం కింద నమోదు కానవసరంలేని పన్ను చెల్లింపుదారులు తమ రిజిస్ట్రేషనును జులై 22కల్లా రద్దు చేసుకోవాలి. ఎవరైతే జిఎస్‌టి విధానానికి మారక, రిజిస్ట్రేషను చేయిం చుకోవాలసి ఉంటుందో వారు దానిని జులై 22కల్లా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో సూచించింది.
వ్యాపారులకే మేలు
ఇంతవరకు ఏ పన్ను విధానం కింద కూడా రిజిస్టరు కాని కొత్త పన్ను చెల్లింపుదారులు జులై 30కల్లా రిజిస్ట్రేషను చేయించుకోవాలి. ఒకవేళ ఆర్థిక సంవత్సరంలో ఎవరి వ్యాపారమైనా రూ. 20 లక్షల టర్నోవరు పరిమితిని దాటితే వారు 30 రోజుల్లోగా తమ వ్యాపారాన్ని రిజి స్ట్రేషను చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఏ వ్యాపార సంస్థ అయిన చెల్లుబాటు అయ్యే పాన్, ఇ-మెయిల్ ఐడి, మొబైల్ నంబరు కలిగి ఉంటే ఆ సంస్థ ఉమ్మడి పోర్టల్ https://www.gst.gov.in/ లో ఆన్‌లైన్ దరఖాస్తును దాఖలు చేయవచ్చు. అలాగే జిఎస్‌టి కోసం రిజిస్టర్డు చేసుకోవాలి. జిఎస్‌టి కింద రిజిస్ట్రేషను చేసుకోవడం చాలా సులభమైన ప్రక్రియ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. జిఎస్‌టి కింద నమోదు చేసు కోవడం వ్యాపారులకే మేలని, దానివల్ల వారు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని తెలిపింది. ‘రిజిస్ట్రేషను చేసుకోవడం వల్ల వ్యాపారం వృద్ధి చెందగలదు. రిజిస్ట్రేషను చేసుకోని వ్యాపారులకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. జిఎస్‌టి కింద నమోదైన కొనుగోలుదారులు జిఎస్‌టి కింద నమోదైన సప్లయర్ల నుంచే కొనేందుకు ప్రాధాన్యతను ఇస్తారు. దీని వల్ల వారికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ దొరికే అవకాశం ఉం టుంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. ‘ఏ వ్యా పారైన రిజిస్ట్రేషను చేసుకుని ఉంటే అతడు దేశానికి తన వంతు సేవలు అందిస్తున్నట్లే. పైగా ప్రభుత్వానికి పన్నులు సక్రమంగా చెల్లిస్తూ తోడ్పడుతున్నట్లే’ అని పేర్కొంది.
వేగవంతం చేయాలి : ప్రధాని
జిఎస్‌టి విధానం కింద వ్యాపారులందరూ వేగవంతంగా నమోదయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ వారం కిందట ఆయా రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల కార్య దర్శులను కోరారు. ఆయన అనుకూల క్రియాశీల పాలన మరియు సకాలంలో అమలు(ప్రగతి) అనే బహుళ న మూనా వేదికపై చెప్పారు. ఆ టెలికాన్ఫరెన్స్ వేదికలో ఆయన ఉన్నతాధికారులతో మాటామంతీ జరిపారు.

Comments

comments