Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

ఇద్దరు పిల్లలుతో సహా దంపతుల ఆత్మహత్య!

Family-Suicide

బెంగళూరు : కర్ణాటకలోని కలబురిగి ప్రాంతంలో దంపతులు, వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. తాము చనిపోయిన తర్వాత తమ మృతదేహాలను వైద్యకళాశాలలకు దానిమివ్వాలని డెత్‌నోట్ రాసి మరీ వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. భూగర్భజల పరిశోధకుడిగా పని చేస్తున్న శ్రీకాంత్ కమలాపుర్కర్ కుటుంబంతో కలిసి 17 సంవత్సరాలుగా సరస్వతి గోదాము లేఅవుట్‌లో నివాసముంటున్నారు.

శనివారం ఉదయం తమ ఇంటి ముందు ఉన్న పాలప్యాకెట్లు తీయకపోవడంతో ఇంటికి సమీపంలో నివాసముంటున్న శ్రీకాంత్ బంధువులు గమనించారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో వాళ్లు తలుపులు పగలగొట్టి చూడగా.. శ్రీకాంత్‌తో పాటు ఆయన భార్య ధనుశ్రీ కొడుకు చేతన్ (21), కూతురు సాక్షి (16)లు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసింది. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, శ్రీకాంత్ రాసిన డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, మృతదేహాలను పరిశోధనల కోసం మెడికల్ కాలేజీకి ఇవ్వాలని అందులో రాసి ఉంది. ఆర్థిక సమస్యలే ఈ ఘోరానికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు.

Comments

comments