Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

త్రైమాసిక ఫలితాలపైనే దృష్టి

 ఈ వారంలోనే రిలయన్స్, విప్రో ఫలితాలు
 మార్కెట్‌లో ఒడిదుకుడులు ఉంటాయి:ఆర్థిక నిపుణులు

Market

న్యూఢిల్లీ: ఈ వారంలో విడుదల చేయనున్న తొలి త్రైమాసిక(ఏప్రిల్-జూన్) ఫలితాలపైనే ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరించారని ఆర్థిక నిపుణులు అంటు న్నారు. జులై 17 నుంచి ప్రారంభ మయ్యే స్టాక్‌మార్కెట్‌లో రిలయన్స్ ఇండ స్ట్రీస్, విప్రో కంపెనీల ఫలితాలు కీలతపాత్ర పోషించనున్నాయని తెలిపారు. అదే సమయంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మదుపర్లు దృష్టి పెట్టారని ఆర్థిక నిపుణుడు అబ్నిష్ కుమార్ సుధాన్షు తెలిపారు. గత వారం విడుదలైన కీలక ఆర్థిక గణాంకాల ప్రభావం ఈవారం కనిపించ నుంది. ఈ వారంలో దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఎసిసి, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా వంటి కంపెనీలు క్యూ1 ఫలితాలు ప్రకటిం చనున్నాయి. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వీటిపైనా దృష్టి పెట్టను న్నారు. త్రైమాసిక ఫలితాల వెల్లడికి ముందు.. ఆ తర్వాత స్టాక్స్ ఒడిదు డుకులను ఎదుర్కొంటాయని సామ్కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోడి అన్నారు. గత వారాంతం శుక్రవారం నాటికి సెన్సెక్స్ 17 పాయింట్లు కోల్పో యి 32,021 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 5 పాయింట్ల అత్యల్ప నష్టంతో 9,886 వద్ద ముగిసింది.
టాప్-9 కంపెనీల మార్కెట్ విలువ రూ.67,754 కోట్లు అప్
గతవారం టాప్-10 బ్లూచిప్ కంపెనీల్లో తొమ్మిది సంస్థలు మార్కెట్ విలువ (ఎం-క్యాప్)ను భారీగా పెంచుకున్నాయి. మొత్తంగా ఎం-క్యాప్ రూ.67, 754.53 కోట్లు పెరగ్గా.. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసిఎస్ వంటి కంపెనీలు భారీ లాభపడ్డాయి. ప్రభుత్వరంగ సంస్థ ఒఎన్ జిసి మాత్రమే మార్కెట్ విలువను కోల్పోగా.. మిగతా అన్ని సంస్థలు లాభాలను నమోదు చేశాయి. అయితే మార్కెట్లో పది బ్లూచిప్ కంపెనీల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, హిందుస్తాన్ యునిలీవర్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌లు ఎం-క్యాప్‌ను పెంచుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.13,113.65 కోట్లు పెరిగి రూ.4,97,857.07 కోట్లకు చేరింది. ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విలువ రూ.12,749.16 కోట్లు పుంజుకుని రూ.4,59,199.31 కోట్లు కాగా, మరోవైపు ఎస్‌బిఐ ఎం-క్యాప్ రూ.9,840.54 కోట్లు పెరిగి రూ.2,51,710.59 కోట్లకు చేరింది. హిందుస్తాన్ యునిలీవర్ విలువ రూ.9,079.93 కోట్లు పెరిగి రూ.2,46,684.02 కోట్లకు చేరగా.. దేశీయ రెండో అతిపెద్ద ఐటి సంస్థ ఇన్ఫోసిస్ విలువ రూ.8,280.49 కోట్లు వృద్ధిని సాధించి రూ.2,23,274.51 కోట్లకు చేరింది. ఇక బ్యాంకింగ్ రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.4,028.13 కోట్లు పెరిగి రూ.4,32,669.79 కోట్లకు చేరగా, మారుతీ సుజుకీ ఎం-క్యాప్ రూ.3,853.03 కోట్ల వృద్ధితో రూ.2,28, 275.86 కోట్లు అయింది. ఇక ఎఫ్‌ఎంసిజి దిగ్గజం ఐటిసి సంస్థ గతవారంలో రూ.3,767.17 కోట్లు ఎం-క్యాప్‌ను పెంచుకుని మొత్తంగా రూ.4,09, 771.01 కోట్లకు చేరింది. అదే సమయంలో హెచ్‌డిఎఫ్‌సి విలువ రూ.3,042.43 కోట్లు పెరిగి రూ.2,62,556.65 కోట్లు అయింది. ఆఖరికిగా ఒఎన్‌జిసి సంస్థ మాత్రమే రూ.1,411.66 కోట్లు మార్కెట్ విలువను కోల్పోయి రూ.2,03,470.94 కోట్లకు చేరింది. టాప్-10 కంపెనీల్లో ర్యాం కింగ్ వారీగా చూస్తే ఆర్‌ఐఎల్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత వరు సగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, హెచ్ యుఎల్, మారుతీ, ఇన్ఫోసిస్, ఒఎన్‌జిసిలు ఉన్నాయి. గతవారం మార్కెట్ భారీగా లాభపడింది. రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ఠానికి పడిపోవడం, వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన వ్యాఖ్యలు, రుతుపవనాలు ఇలా వరుస సానుకూల సంకేతాలతో రికార్డు స్థాయిలో సూచీలు ముందుకు సాగాయి.

Comments

comments