Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

విదేశీ పెట్టుబడుల ప్రవాహం

 జులైలో ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు
Forigen-Investments

న్యూఢిల్లీ: భారత్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడుల జోరు ఇంకా కొనసాగు తూనే ఉంది. జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) అమలు, ఇతర ఉద్దీపన పథకాల తో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ పట్ల ఆకర్షితులవుతున్నారు. జులైలో ఇప్పటి వరకు మూలధన మార్కెట్‌లోకి దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత ఐదు నెలల్లో(ఫిబ్రవరి-జూన్) వివిధ రంగాల్లో నికరంగా రూ.1.62 లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇంతకుముందు ఈ ఇన్వెస్టర్లు జనవరి నెలలో డెబిట్ మార్కెట్లో నుంచి రూ.3,496 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం విశేషం. తాజాగా దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం సానుకూల పరిణామమని ఆర్థిక నిపుణుడు దినేష్ రోహిరా అన్నారు. దీంతో పాటు జులై 1 నుంచి జిఎస్‌టిని అమలు చేయడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు పెట్టుబడులు పెట్టడం మరింత సులభతరంగా మారిందని, ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని అని అన్నారు. ఇటీవల అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాల సూచీలు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పునరుద్ధరణ సంకేతాలు ఇవ్వడం.. పెట్టు బడుల విషయంలో భారత్ వంటి దేశాలపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ తగ్గుతూ వస్తుం డడంతో ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియా ఇన్వెస్టర్లు) పెట్టుబడులు మందగించ నున్నాయని కూడా రోహిరా అభిప్రాయపడ్డారు. అమెరికా, ఇతర ప్రధాన దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుం దని అన్నారు. డిపాజిటరీ డేటాను పరిశీలిస్తే.. జులై 3-14 తేదీల్లో ఈక్విటీ మార్కెట్లోకి ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లు రూ.498 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెబిట్ మార్కెట్లోకి రూ.10,405 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీటి మొత్తం రూ.10,903 కోట్లు(1.7 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇన్‌ఫ్లో.. క్యాపిటల్ మార్కెట్లోకి మొత్తం పెట్టుబడులు (ఈక్విటీ, డెబిట్) రూ.1.6 లక్షల కోట్లకు(24 బిలియన్ డాలర్లు)కు చేరాయి.

Comments

comments