Search
Tuesday 26 September 2017
  • :
  • :
Latest News

భూంఫట్

                Land-grabing

మన తెలంగాణ : మియాపూర్ భూకుంభకోణం తర్వాత ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం భూములను తిరిగి సర్వే చేసినప్పటికీ రంగారెడ్డి జిల్లాలో భూదాన్‌కు చెందిన కోట్లాది రూపాయల విలువ కలిగిన 4,800 ఎకరాల భూముల జాడ తెలియడం లేదు. ఈ మేరకు హైదరాబాద్ శివారు మండలాల్లో భూములను పరిరక్షించేందుకు వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్లను  రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. భూ దాన్ భూములను భూమిలేని పేదలకు భూస్వాములు పంపిణీ చేశారు. పూర్వ నల్లగొండ జిల్లా (ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా)లోని పోచంపల్లిలో 1951లో ఆచార్య వినోబా భావె భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారు.

సేకరించి న భూములను ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని భూములను  భూదాన్ యజ్ఞ బోర్డు నియంత్రణలో ఉంచారు. రెండు జిల్లాల్లో మొత్తం 49,614 ఎకరాల భూములకు గాను రెండు జిలాల్లో 14,720 ఎకరాల భూములు భూస్వాములు విరాళంగా ఇచ్చినవి ఉన్నాయి. 13,101 ఎకరాల భూములకు సర్వే నెంబర్లు లేవు. రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల్లో 4,800 ఎకరాల భూములు ఎక్కడున్నాయో కనుగొనడం అధికారులకు సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అధికారులు గతంలో ప్రభుత్వానికి 16,369 ఎకరాల భూదాన్ భూములు అందుబాటులో ఉన్నాయని సమాచారం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో తనిఖీ తర్వాత ఇబ్రహీంపట్నం,కందుకూర్, హయత్‌నగర్ తదితర మండలాల్లో 11,470 ఎకరాలనుమాత్రమే గుర్తించగలిగారు.

4,800 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నించినప్పటికీ సర్వే నెంబర్లు లేకపోవడం ఇబ్బంది కరంగా మరింది. వివిధ మండలాలల్లో తిరిగి తనిఖీ చేయాలని, భూదానం చేసిన వారి ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్లను పరిశీలించాలని, దానం చేశాక మిగిలిన భూముల వారసుల భూములను పరిశీలించడం ద్వారా భూదాన్ భూములు కొనుగొనేందుకు యత్నిస్తున్నామని రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించామన్నారు.

రంగారెడ్డి జిల్లాలో కొంత భూమి వాణిజ్య కార్యకలాపాల కోసం ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. అయి తే నిబంధనల ప్రకా రం భూదాన్ భూములను కేవలం వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భూదాన్ భూముల అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. భూదానం పొందిన ప్రజలు ఆ భూమిని వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అమ్మడం లేదా లీజుకు ఇచ్చినట్లు ప్రభుత్వం దృష్టి కి వచ్చింది. ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్.కె.సిన్హా అధ్యక్షతన ఒక కమిటీని నియ మించింది. ఆ కమిటీ సిఐడితో విచారణ జరిపించాలని సిఫారసు చేసింది. కమిటీ నివేదికపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

గణాంకాల్లో భూదాన్ భూములు : రంగారెడ్డి, నల్గొండ రెండు జిల్లాలో మొత్తం భూదాన్ భూములు 49,614 ఎకరాలు. ఇందు లో భూస్వాములు దానంగా ఇచ్చిన భూములు 14,720 ఎకరాలు. మొత్తం భూమిలో సర్వే నెంబర్లు లేని భూములు 13,101 ఎకరాలు. సర్వే నెంబర్లు కలిగిన భూమి 9,929 ఎకరాలు.

Comments

comments