Search
Thursday 27 July 2017
  • :
  • :
Latest News

దళితుడిని పిలిపించి హత్య

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మాందాపురంలో ఘటన

               Dalit

దేవరకొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం మాందాపురం గ్రామంలోని మారెపల్లి రాములు (48)పై అగ్రకులస్తులు భూ తగాదాలతో ఇంటికి పిలిపించి చంపేసిన సంఘటన మాందాపురం గ్రామంలో చోటు చేసుకుంది. మృతు డిని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకరావడం జరిగింది.

అక్కడ దళిత సంఘాల నాయకులు నల్ల వెంకటయ్య, లింగాల పెద్దయ్య, భూషపాక వెంకటయ్య, ముదిగొండ ఎల్లేష్, బీఎస్పీ నాయకులు బండారి నర్సింహ్మ, కట్ట యాదయ్యలు దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్‌లో ధర్నా నిర్వహించి, మృతిచెందిన కుటుంబానికి ఆధుకోవాలని, మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యో గం, 3లక్షల ఎక్స్‌గ్రేషియా, అమ్మాయికి ఉచిత విద్య, డబుల్ బెడ్‌రూం ఇల్లు, మూడు ఎకరాల భూమి కేటాయించాలని, అదేవిధంగా రాములు మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించి, ఇలాంటి సంఘటనలు గ్రామంలో మళ్ళి జరుగ కుండా ఉండేవిధంగా పోలీసులను కట్టుదిట్టమైన ఏర్పాట్లుతో శాంతి భద్రతలను కాపాడాలని, దళితులపై  దాడులు జరగకుండా చూడాలని దేవర కొండ డీఎస్పీ రవికుమార్, సి.ఐ. రామకృష్ణలను కోరారు.  నిందితులు నలుగురుని తమ అదుపులోకి తీసుకున్నామని, వారిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ క్రింద బైండోవర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

Comments

comments