Search
Sunday 23 July 2017
  • :
  • :

భాగ్యనగరంలో భారీ వర్షం

RAINS

హైదరాబాద్: భాగ్యనగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అటు ప్రజలు, ఇటు వాహనదారులు అవస్థలు పడుతున్నారు.  వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం.

Comments

comments