Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

జోష్‌లో మిథాలీ సేన

Team-India-Women's

లండన్: ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. న్యూజి లాండ్‌తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన 186 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించడంతో జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసిన భారత్ కీలక మ్యాచ్‌లో ఆకా శమే హద్దుగా చెలరేగి పోయింది. కెప్టెన్ మిథాలీ రాజ్ జట్టును ముందుండి నడిపించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన ఈసారి కూడా నిరాశ పరిచింది. ఫాంలో ఉన్న పూనమ్ రౌత్ కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరింది. అయితే కెప్టెన్ మిథాలీ రాజ్ చిరస్మరణీయ ఆటతో జట్టును ఆదుకున్న విష యం తెలిసిందే. కీలక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్‌ను ఝులిపించింది. ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబ రచని కౌర్ కివీస్‌పై మాత్రం స్ఫూర్తి దాయక ఆటను కనబరి చింది. ఇది భారత్‌కు కలిసి వచ్చే అంశం. ఇక, మిథాలీ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడం జట్టుకు ఊరటనిచ్చే అంశం. ఒకవైపు ఒత్తిడిని తట్టుకుంటూనే జట్టును కష్టాల్లో నుంచి గట్టేక్కించింది. మిథాలీ ప్రదర్శన భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనే చెప్పాలి. ఇక కీలక దశలో వేద కృష్ణమూర్తి చెలరేగి ఆడింది. భారత మహిళా వన్డే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించి రికార్డు సృష్టించింది. వేద మెరుపులు మెరిపించడంతో భారత్ గౌరవప్రద స్కోరును సాధించగలి గింది. కీలక మ్యాచ్‌లో వేద ఫాంను దొరకపుచ్చుకోవడం టీమిం డియా శుభ పరిణామం చెప్పుకోవచ్చు. ఇక, బౌలింగ్‌లో కూడా భారత్ మెరిసింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు జులన్ గోస్వామి, శిఖా పాండే నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌విమె న్‌లను హడలెత్తించారు. ఇది భారత్‌కు ఊరటనిచ్చే అంశమే. ఇక, రాజేశ్వరి గైక్వాడ్ ప్రదర్శన గురించి ఎంత పొగిడిన తక్కు వే. ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాజేశ్వరి చిరస్మ రణీయ ప్రదర్శన ఇచ్చింది. కివీస్ క్రికెటర్లను తన పదునైన బౌలింగ్‌తో హడలెత్తించింది. 15 పరుగులకే ఐదు వికెట్లు పడ గొట్టి భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించింది. దీప్తి శర్మ కూడా మెరుపులు మెరిపించడం భారత్‌కు మరింత మేలు చేసే పరిణామం. కివీస్‌పై భారీ విజయం సాధించిన మిథాలీ సేన గురువారం ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ సమరానికి ఆత్మవి శ్వాసంతో సిద్ధమవుతుందనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిస్తే భారత్ ఫైనల్‌కు చేరడం ఖాయం. అయితే ఆస్ట్రేలియా వంటి పటిష్ఠ జట్టును ఓడించడం అంత తేలికైన అంశం కాదు. ప్రతిభా వంతులైన క్రికెటర్లతో కూడిన ఆస్ట్రేలియా లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి పాలైంది. అది కూడా ఇంగ్లాండ్ చేతిలో స్వల్ప తేడాతో పరాజయం చవిచూసింది. అయితే తమ పూర్తి సామర్థం మేరకు ఆడితే టైటిల్ పోరుకు చేరడం భారత్‌కు అసాధ్యమేమి కాదు.

Comments

comments