Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కారుకు ప్రతిరోజు లక్ష రూపాయల అద్దె!

భవ్య క్రియేషన్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటించిన చిత్రం ‘శమంతకమణి’. వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
sriram-aditya

అనూహ్య స్పందన…
మా సినిమాకు అనూహ్య స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది ఈ చిత్రం. మొదటి రోజే చాలా మంది నాకు ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పారు.
యదార్థ సంఘటన ఆధారంగా…
కొన్ని సంవత్సరాల క్రితం ఓ రోజు నేను ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్తే నా కారు దొంగిలించా రు. పార్కింగ్‌లో కారు పోయింది. ఈ విషయాన్ని అందరికీ చెబితే షాకింగ్‌గా స్పందిం చారు. మూడు నెలల పాటు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగాను. అక్కడ ఎస్‌ఐతో సహా పలువు రు పోలీసులు నాకు పరిచయమయ్యారు. ఈ యదార్థ సంఘటన ఆధారంగా కారు పోవడమనే ఐడియాతో ‘శమంతకమణి’ కథను రాసుకోవడం జరిగింది.
ఐదుగురు ప్రధాన పాత్రధారులు…
2014లో ఈ సినిమా కథ రాసుకున్నాను. ఈ కథలో ఐదుగురు ప్రధాన పాత్రధారులు. ఒకే కథను ఐదుగురి పాయింట్ వ్యూలో చెప్పడమే ఈ సినిమా. సినిమాలో ఈ పాత్రలన్నింటికీ మంచి ప్రాధాన్యత ఉంటుంది.
అద్భుతంగా నటించారు…
సినిమాలో యంగ్ హీరోలు నారా రోహిత్, ఆది, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌లు అద్భుతంగా నటించారు. అందరికీ కథ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. వారి సహకారంతోనే సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది.
ఒక్కొక్కరి సీన్ టాప్‌గా…
ఒక్కో హీరోకు ఒక్కొక్క సీన్ టాప్‌గా ఉంటుంది. సుధీర్‌బాబు ఓ సీన్‌లో అదరగొడితే… ఆది ఓ సన్నివేశంలో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాడు. సందీప్ కిషన్ కొన్ని సీన్లలో ఆకట్టుకుంటాడు. నారా రోహిత్ అన్ని సీన్లలో చక్కగా నటించాడు.
మొత్తమ్మీద మంచి సక్సెస్…
సినిమా రిలీజైన తర్వాత నాకు ఫస్టాఫ్ ఇంకొంచెం హ్యూమరస్‌గా ఉంటే బాగుంటుందనిపించింది. ఇంకొంచెం ఎనర్జీ ఉంటే మరింత బాగుండేది. అయితే సెకండాఫ్‌లో సినిమా ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. మొత్తమ్మీద సినిమా మంచి సక్సెస్‌ను అందుకుంది.
రెండున్నర నెలల పాటు పనిచేశాం…
ఈ స్క్రిప్ట్‌పై రెండున్నర నెలల పాటు వర్క్ చేసి కథ, డైలాగ్స్‌ను సమకూర్చుకున్నాను. నాకు మంచి రైటింగ్ టీం ఉంది. వెంకీ అనే అబ్బాయి నా మెయిన్ స్క్రిప్ట్ అసోసియేట్. అయితే శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలో శమంతకమణి అనే వజ్రం గురించి ప్రస్తావన ఉంటుంది. మా సినిమాలో శమంతకమణి అనే కారు కథలో సెంట్రల్‌పాయింట్‌గాఉంది.
కెవి రెడ్డి సినిమాల ప్రభావం…
నేను చిన్నప్పుడు పాత సినిమాలు బాగా చూసేవాడిని. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో కె.వి.రెడ్డి, విఠలాచార్య సినిమాలు బాగా నచ్చేవి. కెవి రెడ్డి సినిమాల ప్రభావం నాపై ఎక్కువగా ఉంటుంది. ఆయన సినిమాలు లాజికల్‌గా ఉంటాయి. చిన్న డైలాగులోనే చాలా హాస్యాన్ని తీసుకురావచ్చని ఆయన సినిమాల ద్వారా తెలిసింది. అయితే నేను షెర్లాక్ హోమ్స్ నవలలు బాగా చదివేవాడిని. అవి ఎంతో థ్రిల్లింగ్‌గా ఉండేవి. వీటి ప్రభావం కూడా నాపై ఉంది.
పది రోజుల పాటు కారుపై షూటింగ్…
సినిమా కోసం రోల్స్ రాయిస్ కారు కావాలనుకున్నాం. ఓ రోజు నేను మా ఇంటి నుంచి బయటకు వస్తుంటే ఎదురుగా రోడ్డుపై రోల్స్ రాయిస్ కారు కనిపించింది. పక్కనే కారు యజమాని ఐస్‌క్రీం తింటూ కనిపించాడు. ఆయనతో మాట్లాడి ఒప్పించి కారును తీసుకోవడం జరిగింది. అయితే ఈ కారు కోసం రోజుకు లక్ష రూపాయల అద్దె చెల్లించాం. పది రోజుల పాటు కారుపై షూటింగ్ జరిగింది.
లవ్, ఎమోషన్‌తో నెక్స్ మూవీ…
ఇప్పట్లో మళ్లీ క్రైమ్ కామెడీ మూవీ చేయను. కొత్త స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. లవ్,ఎమోషన్‌తో కూడుకున్న కథ ఇది. అన్నీ సిద్ధమయ్యాక ఈ సినిమా గురించి వెల్లడిస్తాను.

Comments

comments