Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

రూ.64,654 కోట్లకు పెరిగిన జన్‌ధన్ డిపాజిట్లు

Jandhanన్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ.64, 654 కోట్లతో సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకు న్నాయి. డిమానిటైజేషన్(నోట్ల రద్దు) తర్వాత ఏడు నెలల కాలంలో దాదాపు రూ.300 కోట్లు పెరిగాయి. ప్రధా నమంత్రి నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జన్‌ధ న్ యోజన పథకానన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు బ్యాంకులు లేని ప్రాంతాలు, బ్యాంకింగ్ వ్యవస్థ లో లేని ప్రజలను లక్షంగా చేసుకుని ఈ జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించగా, తొలుత మెల్లగా ప్రారంభ మైన వేగంగా ఖాతాలు పెరుగుతూ వచ్చాయి. తాజా గా ఈ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పటి వరకు రూ.64,564 కోట్ల డిపాజిట్లు జన్‌ధన్ ఖాతాల్లోకి వచ్చి చేరినట్లు ప్రభుత్వ గణాం కాల ద్వారా వెల్లడైంది. జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లపై సహచట్టం ద్వారా దరఖాస్తు చేయగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆయా గణాంకాలను వెల్లడించింది. జూన్ 14వ తేదీ నాటికి జన్‌ధన్ పథకంలో భాగంగా 28.9కోట్ల ఖాతాలు ఉన్నాయి. ఇందులో 23.27కోట్ల ఖాతాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. మిగతా 4.7 కోట్ల ఖాతాలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో, 92.7లక్షల ఖాతాలు ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ మొత్తం ఖాతాల్లో రూ.64,564 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.50,800 కోట్లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రూ. 11,683.42కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.2,080.62 కోట్లు ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు చేసే సమయానికి 25.58 కోట్ల ఖాతాల్లో రూ64,252.15 కోట్ల డిపాజిట్లు ఉండగా.. జూన్ 14 వరకు రూ.311.93 కోట్ల నగదు డిపాజిట్ ద్వారా ఈ మొత్తం రూ.64,564 కోట్లకు చేరింది. గత ఏడాది నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు వెల్లువెత్తాయి. దీంతో అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే.

Comments

comments