Search
Monday 19 February 2018
  • :
  • :
Latest News

ఎమ్మెల్యేకు కోయదొరల టోకరా

MLA-CHALLA

వరంగల్ రూరల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి కోయదొరలు టోకరా వేశారు. పూజలు చేస్తే ధర్మారెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న కోయదొరల మాటను నమ్మిన ధర్మారెడ్డి కూతురు శ్యాంరెడ్డి మానసరెడ్డి కోయదొరలకు సుమారు 57 లక్షల రూపాయలను ఇచ్చారు. డబ్బు తీసుకున్న కోయదొరలు అటుపై ఆచూకీ లేకుండా పోయారు. తాము మోసపోయిన విషయాన్ని గ్రహించిన మానసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయదొరలు లక్ష్మణరాజు, వంశీరాజులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Koyadoralu cheated the Parakala MLA Challa Dharmareddy

Comments

comments