Search
Friday 20 April 2018
  • :
  • :

ఆ సినిమా టైటిల్‌నే కొంత మార్చి…

Nithin

పవన్‌కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకోవడంలో యంగ్ హీరో నితిన్ ఏమాత్రం సంశయించడు. అలాగే తన సినిమాల్లో ఈ స్టార్ హీరోను కాపీ కొట్టడానికి ఏమాత్రం మొహమాట పడడు. ‘లై’ చిత్రంలో నితిన్‌ను చూస్తే ‘పంజా’ మూవీలో పవన్‌కళ్యాణ్ లుక్ కనిపిస్తుంది. అయితే ఈసారి ఏకంగా పవన్ సినిమా టైటిల్‌నే తన సినిమాకు కొంచెం మార్చి ఉపయో గించబోతున్నాడట. ‘లై’ మూవీ పూర్తిచేసిన తర్వాత… కృష్ణచైతన్య దర్శ కత్వంలో తన కొత్త సినిమా చేయబోతున్నాడు నితిన్. ఈ మూవీకి ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. పవన్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పేరును కొంచెం మార్చేసి తన సినిమాకు పేరుగా పెట్టేసుకుంటున్నాడన్న మాట. ఈ సినిమాను మరో స్పె షాలిటీ ఏమిటంటే పవన్ తన సొంత బ్యానర్ అయిన ‘పవన్‌కళ్యాణ్ క్రి యేటివ్ వర్క్’పై నిర్మిస్తుండడమే. ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మిస్తుండగా అందులో పవన్ కూడా ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇతర నిర్మాతలు. తన అభిమాన హీరో నిర్మిస్తున్న ఈ మూవీలో తనే హీరోగా నటిస్తూ … ఆ హీరో సినిమా టైటిల్‌నే సినిమా పేరుగా పెట్టేసుకోవడం విశేషం.

Comments

comments