Search
Tuesday 26 September 2017
  • :
  • :
Latest News

‘పైసా వసూల్’ డబ్బింగ్ షురూ

Balaiah

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ శరవేగంగా పనుల్ని జరుపుకుంటోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్‌ను మొదలుపెట్టింది. బాలకృష్ణ-పూరి జగన్నాథ్ వంటి క్రేజీ కాంబినేషన్‌లోని ఈ చిత్రాన్ని ప్రకటించిన రోజు నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలకృష్ణ స్టైలిష్ లుక్‌తో సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆఖరి షెడ్యూల్ ఈనెల 28న ముగియనుంది. దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు ఫిల్మ్‌మేకర్స్. బాలయ్యకు జోడీగా శ్రియా శరణ్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Comments

comments