Search
Thursday 27 July 2017
  • :
  • :
Latest News

నెటిజన్ల ఆగ్రహానికి పాక్ క్రికెటర్ బలి

Umar-Akmal

పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఖరీదైన బెంట్లీ కారుతో ఆయన దిగిన ఫోటో ఒకటి ట్విట్టర్ లో పెట్టడమే ఇందుకు కారణమైంది. దీనికి  ‘ఎంతో కఠినమైన శిక్షణ అనంతరం లండన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను’ అంటూ అక్మల్ ఫోటో కింద పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు ఆయనపై నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు.

నువ్వు కష్టపడుతున్నావా? , ‘బెంట్లీ కారు కొనేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఇది నీ కారు కాదు. ఇతరుల కారు వద్ద నిల్చుని ఫొటో దిగావు’, ‘భవిష్యత్తులో క్యాబ్‌ డ్రైవర్‌గా స్థిరపడేందుకు శిక్షణ పొందుతున్నావా, ప్రస్తుత జట్టులో నువ్వు లేవు’, ‘క్రికెట్‌ పై దృష్టి పెట్టి జట్టులో స్థానం సంపాదించు’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ చూసిన అక్మల్ కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. దాంతో వెంటనే దిగొచ్చిన అక్మల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించాడు.

‘నా అభిమానులందర్నీ ప్రేమిస్తున్నాను. మీ అందరికీ ఒక విన్నపం. దయచేసి నాపై నెగిటివ్‌ కామెంట్లు ఆపండి. మీ ప్రార్థనలు, మద్దతు నాకు ఎంతో అవసరం’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్మల్ తిరిగి జాతీయ జట్టులో వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికోసం ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకునే దిశగా అక్మల్‌ ప్రస్తుతం లండన్ లో  శిక్షణ పొందుతున్నాడు.

 

Comments

comments