Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

ఫ్లైట్‌లో వాటర్ లీకేజీ..!

Water-Lekage-in-Flight

వాషింగ్టన్: ఇంటి పైకప్పు బాగా లేకపోతే వర్షం పడినప్పడు నీళ్లు కారడం అనేది సాధరణమే. అప్పడప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పడు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సమస్య ఎదురవుతుంది. ఇదే వాటర్ లీకేజీ సమస్య విమానంలో ఉంటే.. ఏకంగా విమానంలో ప్రయాణికులు జర్నీ సమయంలో నీళ్లు కారి మీద పడుతుండగా ప్రయాణించాల్సి వస్తే. ఆలోచిస్తేనే కాస్తా విడ్డురంగా ఉంది కదూ. కానీ ఇది జరిగింది. ప్రయాణికులు ఫ్లైట్‌లో వర్షపు నీళ్లు లీకవుతుంటే తడవకుండా తప్పించుకుని ప్రయాణించాల్సి వచ్చింది. అట్లాంటా నుంచి ఫ్లోరిడాకు వెళ్లిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఈ తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తూ వైరల్‌గా మారింది.

Comments

comments