Search
Tuesday 26 September 2017
  • :
  • :
Latest News

రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్

Pawan-Kalyanటాలీవుడ్‌లో స్టార్ హీరోగా పవన్‌కళ్యాణ్‌కు తిరుగులేని ఇమేజ్ ఉంది. ఆయన స్టార్ పవర్ ఎటువంటిదంటే ఆయన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తూ అదరగొడతాయి. రిలీజ్‌కు ముందు ఆయన సినిమాలకు మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం మరోసారి ఇది నిరూపించింది. పవన్‌కిది 25వ సినిమా. ఈ చిత్రానికి అనూహ్యంగా బిజినెస్ జరుగుతుండడం విశేషం. కేవలం  నైజాం, ఆంధ్రప్రదేశ్ ఏరియాల్లో ఈ సినిమా రూ.90 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ రూ.110 కోట్లను దాటింది. రికార్డు స్థాయిలో ఇంతటి ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకొని పవన్ మరోసారి హల్‌చల్ చేస్తున్నాడు. ఇప్పటివరకు టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో యంగ్ హీరోయిన్లు కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్‌లు పవన్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఇక పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి రికార్డు కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఎటువంటి కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాల్సిందే.

Comments

comments