Search
Friday 20 April 2018
  • :
  • :

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

                                      Presidential Elections Procedures in India

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తొలి ఓటు వేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ హౌస్, అసెంబ్లీల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ఎన్నికలలో 543 మంది లోక్ సభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు, 4120 మంది ఎంఎల్‌ఎలు ఓటు వేయనున్నారు. ఎంపిలు, ఎంఎల్‌ఎల మొత్తం ఓట్ల విలువ 10,98,903, ఒక్కో ఎంపికి 708 పాయింట్లుగా ఉంది. రాష్ట్రపతి బరిలో ఎన్‌డిఎ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్, విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను పరిశీలించడానికి 33 మందిని ఎన్నికల సంఘం నియమించింది. జూలై-20న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

Comments

comments