ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో వెంకయ్య మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా, ఎన్డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును పోటీలో ఉంచాలని బిజెపి భావిస్తోంది. సోమవారం సాయంత్రం జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటిస్తారు.