Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు

శీలానికి రూ. 40 వేల ఖరీదు నిర్ణయించిన పంచాయతీ పెద్దలు
పోలీసులను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులు
యువకుడిపై అట్రాసిటీ నిర్భయ కేసు నమోదు

                  RAPED

బచ్చన్నపేట : యువతికి మాయ మాటలు చెప్పి వారం రోజుల పాటు లొంగదీసుకొని వ్యవసాయ బావి వద్ద గుట్టుగా నిత్యం అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఆ నోట, ఈ నోట బయటికి పొక్కడంతో, గ్రామంలోని పెద్దలు పంచాయితీ వేసి యువతి శీలానికి రూ. 40 వేలుగా తీర్పు ఇవ్యడంతో బాధిత యువతి తనకు అన్యాయం చేశారని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించిన సంఘటన జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

బాధితురాలి తల్లి దండ్రులు తెలిపిన వివరాల ప్రకారం పోచన్నపేట గ్రామానికి చెందిన కాండ్రా జుసాంబ గారి నర్సయ్య కుమారుడు సిద్దేశ్వర్ అలియాస్ రాజు అనే 22 ఏళ్ల యువకుడు, అదే గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువతి వారం రోజుల నుండి కనిపించక పోవడంతో చుట్టు ప్రక్కల వెతకగా సిద్దెశ్వర్ వ్యవసాయ బావి వద్ద వీరు ఇరువురు కనిపించడంతో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని నిలదీయగా తనకు సంబంధం లేదని అనడంతో గ్రామ పెద్దలను ఆశ్రయించగా గ్రామ పెద్దలు విషయాన్ని బయటికి పొక్కకుండా రూ.40 వేలు యువతి తల్లిదండ్రులకు ఇవ్వాలని తీర్పు చేయగా అందుకు తల్లి దండ్రులు నిరాకరించి తన కూతురికి తగిన న్యాయం చేయాలని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు.

యువకుడిపై అట్రాసిటీ నిర్భయ కేసు నమోదు

యువతికి మాయమాటలు చెప్పి లొంగ దీసుకుని వారం రోజుల పాటు అత్యాచారానికి పాలుపడిన యువకుడిని అదుపులోకి తీసుకొని అతడిపై అట్రాసిటి, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సిఐ కరియుల్లా ఖాన్, ఎస్‌ఐ భరత్‌లు తెలిపారు.

Comments

comments