Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

మిలిటరీ షిప్ మునిగి 34మంది గల్లంతు

SHIP

యాండి : మిలిటరీ షిప్ మునిగి 34 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన ఆఫ్రికా దేశంలోని కెమెరూన్‌లో జరిగింది. ఆ దేశ రక్షణ శాఖకు చెందిన మిలిటరీ నౌక అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 34 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో నౌకలో 37మ ంది ఉన్నట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు. బాకాసీ ద్వీపానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా చమురు నిక్షేపాలు అధికంగా ఉండే బాకాసిని నైజీరియా అంతర్జాతీఆయ కోర్టు ఆదేశాల మేరకు కెమెరూన్‌కు అప్పగించింది.

Ship Drown in River: 34 Killed

Comments

comments