Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

ఇద్దరు ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు..?

                   Sub-Inspector-of-Police

ఖమ్మం క్రైం : ప్రజలు తప్పుచేసే ్త దండించాల్సిన పోలీసులే ప్రజలను బెదింరించడం చూస్తే ఏం చేయాలి? అనే ప్రశ్న ప్రతి పౌరుని మెదడులో మెదులుతుంది. బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన ఎస్‌ఐలే వ్యాపారస్తులపై అకారణంగా దౌర్జన్యానికి పాల్పడటం చూస్తుంటే ఎవరికి పాలుపోని పరిస్థితి. ప్రభుత్వం గన్ ఇచ్చింది అక్రమాలను అరికట్టడానికే తప్ప సామాన్య ప్రజలను బెదిరించడానికి కాదన్న విషయం ఆ అధికారులకు తెలిసి ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

తోటి సహోద్యగులు కూడా ఇదేమి పని అని ప్రశ్నిస్తున్నారు. వారి తండ్రి పోలీస్ ఉద్యోగం చేస్తూనే తన తనయులను ఉన్నతోద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత పోలీస్ వ్యవస్థలో ఉండేది. కానీ ఇప్పుడు వీరు చేసిన ఘనకార్యంపై తన తండ్రినే అవమానభారంతో కుంగిపోయేలా చేసింది. వివరాలలోకి వెళితే… ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్ సమీపంలో నివాసం ఉంటున్న బాణోతు చంద్రం ఏఎస్‌ఐగా ఖమ్మం మహిళా పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తనయులు బాణోత్ రాణా ప్రతాప్, బాణోత్ మహేష్‌లు ఎస్‌ఐలుగా ఉద్యోగం పొంది ఒకరు మహబూబాబాద్ జిల్లాలో, మరొకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 15న శనివారం సాయంత్రం ఖమ్మం బస్టాండ్ సమీపంలోని సయ్యద్ జావీద్ ఖాద్రీ అనే చెప్పుల దుకాణం వ్యాపారిపై ఉద్దేశ్యపూర్వకంగా గతంలో జరిగిన ఓ సంఘటనను మనసులో పెట్టుకొని ఆ ఇద్దరు తుఫాకీతో బెదిరించి నీ మీద మాకు అనుమానం ఉన్నది అని అకారణంగా షాపు యజమానిపై దాడి చేశారు. సదరు వ్యాపారి స్థానిక వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేయగా వారిపై 448, 506, 323 రెడ్‌విత్ 34 ఐపిసి, 27 ఆప్ ఇండియన్ ఆమ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వన్ టౌన్ సిఐ రహమాన్ తెలిపారు. ఉన్నతాధికారులు ఆ ఇద్దరిని
సస్పెండ్ చేసిన్నట్లు సమాచారం.

Comments

comments