Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

గో గూండాలపై ఉమ్మడి పోరు

రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలి : అఖిలపక్ష భేటీలో ప్రధాని మోడీ

PM-Modi

న్యూఢిల్లీ : గో సంరక్షణ పేరిట జరిగే గూండాగిరిపై రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాలని ప్రధా ని నరేంద్ర మోడీ అభ్యర్థించారు. గో రక్షకులు చట్టా న్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని ప్రధాని మరోమారు హెచ్చరించారు. ఈ దురాగతాలను నివారించడంలో రాష్ట్రాలు తమ బాధ్యత నిర్వర్తించాల్సి ఉందని, దౌర్జన్యానికి దిగే వారిపై రాష్ట్రాలు కఠిన చర్య లు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే ఈ అంశానికి రాజకీయ, మతపరమైనరంగు పులుముకోకుండా చూసుకోవల్సి ఉందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఆ తరువాత వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ విలేకరులకు వివరించారు. గోరక్షకులమనే సాకుతో కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని, ఈ చట్ట వ్యతిరేక చర్యలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహించరాదని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హిందువులు గోవును మాతగా భావిస్తారు, పూజిస్తారు. ఇందులో భావోద్వేగాల అంశాలు ఇమిడి ఉన్నాయి. అయితే దీని అర్థం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొమ్మని కాదని ప్రధాని తెలిపారు.

గోవుల రక్షణకు చట్టాలున్నాయని, చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదని ప్రధాని తెలిపా రు. దౌర్జన్యాలు జరగకుండా రాష్ట్రాలవారీగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవల్సి ఉందని, అదే సమయంలో రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ఈ బెడద నివారణకు కదలాల్సి ఉందని తెలిపారు. గో రక్షకుల దౌర్జన్యాలు పెరిగిపోవడంపై ప్రతిపక్షాలు బిజెపిపై మండిపడ్డా యి. తరచూ ముస్లింలు, దళితులపై దాడులు జరుగుతున్నాయని, వారికి రక్షణ లేకుండా పోతోందని వారు విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభ మయ్యే సెషన్‌లో గోరక్షకుల హింసాకాండను ప్రధానంగా ప్రస్తావించాలని ప్రతిపక్షాలు సిద్ధపడుతున్న దశలో ప్రధాని మోడీ దీనిని కీలకంగా తీసుకుని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికపై కూడా మోడీ ప్రస్తావించారు. పోటీ కాకుండా ఈ అత్యున్నత పదవికి ఏకాభిప్రాయం కుదిరి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అత్యున్నత స్థాయిలో అవినీతిపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిపై పోరులో అందరి సహకారం కావాలని అభ్యర్థించారు. స్కామ్‌లలో చిక్కిన వారిని ఎవరూ రక్షించరని, దీనిని అంతా గుర్తించాలని, అవినీతి  సొమ్ముకు అలవాడుపడితే ఎంత అందలం ఎక్కిన వారికి అయినా పతనం తప్పదన్నారు. పరోక్షంగా ఆయన లాలూ ప్రసాద్ యాదవ్‌ను విమర్శించినట్లుగా తేటతెల్లం అయింది. ఆగ స్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం జరుగుతుందని,అన్ని పార్టీలూ ఇందులో ఉత్సాహంతో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

Comments

comments