Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

నా అభిమాన దర్శకుడు సుకుమార్ : రామ్‌చరణ్


Darshakudu-Audio-releaseస్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రం ‘దర్శకుడు’. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బిఎన్‌సిఎన్‌పి విజయ్‌కుమార్, థామస్ రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్క దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయికార్తీక్ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బివిఎస్‌ఎన్ ప్రసాద్, పివిపి, సతీష్ వేగేశ్న, చందు మొండేటి, సుధీర్ వర్మ, నవీన్ ఎర్నేని, వాసువర్మ, కె.దశరథ్, కళ్యాణ్‌కృష్ణ, అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్స్ క్లాప్ బోర్డ్‌ను క్లాప్ కొట్టి ఆడియో సీడీలను రామ్‌చరణ్ విడుదల చేసి తొలి సీడీని సుకుమార్‌కు అందజేశారు. వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ “నాకు దర్శకుడు అనే పేరు వినగానే గుర్తుకొచ్చే రెండు పేర్లు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు. వీరిద్దరిని చూసి ప్రభావితం కాని దర్శకుడెవరు ఉండరనుకుంటాను. అయితే సుకుమార్ నా అభిమాన దర్శకుడు. తక్కువ రోజుల్లో చాలా బాగా నచ్చేసిన వ్యక్తి ఆయన. దర్శకుడు అనే టైటిల్ పెట్టడమే కొత్తదనం. ఈ సినిమా ఓ డైరెక్టర్ జర్నీ. సాయికార్తీక్ యూత్‌ఫుల్‌గా మ్యూజిక్ ఇచ్చారు”అని అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ “మా దర్శకుడు హరిప్రసాద్ ఫిజిక్స్ లెక్చరర్. నాకు మంచి దోస్త్. తను ఈ కథ చెప్పగానే తననే డైరెక్ట్ చేయమని చెప్పాను. తనకు దర్శకత్వ అనుభవం లేకపోయినా ఈ సినిమాను ఓ అనుభవమున్న దర్శకుడిలా ఎంతో బాగా చేశాడు. సాయికార్తీక్ మంచి              మ్యూజిక్ ఇచ్చారు”అని చెప్పారు. దర్శకుడు హరిప్రసాద్ జక్కా మాట్లాడుతూ “నేను ముందు డైరెక్షన్ చేయాలనుకోలేదు. సుకుమార్ కథ వినిపిస్తే… ఆయన నన్నే డైరెక్షన్ చేయమని అన్నారు. దర్శకుడిగా నాకు అనుభవం లేదు. ఎలా చేయాలో తెలియదు. అందుకని నేను మన టాలీవుడ్‌లోని దర్శకులందరి తొలి సినిమాలు చూశాను. అన్ని సూపర్‌హిట్ సినిమాలే. అందుకు కారణం వారి కష్టంతో పాటు మంచి టెక్నికల్ టీం అండగా ఉండడమే. అందుకే మంచి టెక్నీషియన్లను తీసుకోవాలని మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయికార్తీక్, సినిమాటోగ్రాఫర్‌గా ప్రవీణ్, ఎడిటర్‌గా నవీన్ తదితరులు తీసుకున్నాను. హీరోహీరోయిన్‌లు అశోక్, ఈషా చక్కగా నటించారు. కుటుంబమంతా కలిసి చూసే             చిత్రమిది”అని చెప్పారు.

Comments

comments