Search
Thursday 21 September 2017
  • :
  • :
Latest News

భరత్‌ను రవితేజతో ముడిపెట్టి చూడొద్దు: తల్లి

Ravi-Teja-with-Bharath

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమని తల్లి రాజ్యలక్ష్మీఅన్నారు. రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పారు. రవి కనీసం సిగరెట్ కూడా తాగడని, తాగేవాళ్లను ప్రోత్సహించడని చెప్పుకొచ్చారు. అలాంటిది రవితేజకు డ్రగ్స్ అలవాటు ఉందనడం పూర్తిగా అవాస్తవమన్నారు. కావాలనే ఈ కేసులో రవితేజను ఇరికిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

కుటుంబ ఆచారం ప్రకారమే భరత్ అంత్యక్రియలకు హాజరకాలేదన్నారు. నిర్మాతలకు నష్టం కలిగించవద్దనే ఉద్దేశంతోనే రవితేజ షూటింగ్‌కు వెళ్లాడని తెలిపారు. అంతేగాక మద్యం మత్తులోనే రోడ్డు ప్రమాదంలో భరత్ చనిపోయాడనేది కూడా అవాస్తమని చెప్పారు. భరత్ చనిపోయే కొద్దిరోజుల ముందే చెడు అలవాట్లన్నీ మానేశాడని స్పష్టం చేశారు. భరత్‌ను రవితేజతో ముడిపెట్టి చూడవద్దని కోరారు.

Actor Ravi Teja’s mother Rajyalaxmi said he didn’t have any bad hobbits.

Comments

comments