Search
Thursday 27 July 2017
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం భేటీ

KTR

హైదరాబాద్ : భావి నాయకత్వం విద్యార్థుల నుంచే రావాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం తొలిసారిగా భేటీ అయింది. ఈ భేటీలో మంత్రి కెటిఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 60 మందితో కూడిన టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం కమిటీని ఎన్నుకున్నారు. జిల్లాకు ఇద్దరు చొప్పున 62 మంది జిల్లా కో- ఆర్డినేటర్లను ఎన్నుకున్నారు. టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం సమన్వయకర్తలుగా కెటిఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యార్థి విభాగం నేతలకు సూచించారు. కాంగ్రెస్‌పై కెటిఆర్ విరుచుకపడ్డారు.

Comments

comments