Search
Thursday 27 July 2017
  • :
  • :
Latest News

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య?

నేడు బిజెపిపిబిలో నిర్ణయం 

Venkaiahహైదరాబాద్ : ఉప రాష్ట్రపతి పదవికి ఎన్‌డిఎ అభ్యర్థిగా కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఉత్తరాదికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను ఎం పిక చేసిన బిజెపి అధిష్ఠానం దక్షిణాది వ్యక్తికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని కొంత కాలం గా భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నేతలలో వెంకయ్య నాయుడు పేరును ఖరారు చేసేందుకు నాయకత్వం సుముఖత వ్యక్తం చేసిందన్న ప్రచారం సాగుతోంది. ఈ పదవికి వెంకయ్యనాయుడు అన్ని విధాల సమర్థుడని పార్టీ భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాజకీయాల మీద కూడా వెంకయ్యకు మంచి అవగాహన ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి రాజకీయ ప్రస్థానం చేసిన వెంకయ్యనాయుడు అంచలంచెలుగా జాతీయ స్థాయిలోమంచి గుర్తిం పు తెచ్చుకున్నారు. వెంకయ్యనాయుడితో పాటు విద్యాసాగర్‌రావు, జస్టిస్ సదాశివం పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ వీరిలో ఎవరిని ఎంపిక చేసినా ఒక రాష్ట్రానికి చెందిన వారనే భావన వస్తుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అలాకాకుండా వెంకయ్యను ఎంపిక చేస్తే ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు మా రాష్ట్రం వ్యక్తి అని భావించే అవకాశాలున్నాయని పార్టీ అంచనా వేస్తోంది. దక్షిణ భారతదేశ ఐకాన్‌గా నిలిచిన వెంకయ్యకు గడచిన మూడు దఫాలుగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం కూడా కలిసి వచ్చిందని అంటున్నారు. వెంకయ్య అభ్యర్థిత్వాన్ని బిజెపినే కాకుండా మిగిలిన పక్షాలన్నీ ఆమోదించే అవకాశాలున్నాయి. పార్టీ కీలక నేతతో పాటు సంక్షోభ సమయంలో ఆయన పోషించిన పాత్రను కూడా పార్టీ పరిగణనలోకి తీసుకున్నదని అంటున్నారు. ఏ రకం గా చూ సినా ఇందుకు ఆయనే అర్హుడని, ఈ పదవికి వన్నె తెస్తారని మోడీ, అమిత్‌షా వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా  సోమవారం సాయంత్రం జరిగే బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటి వరకు వస్తున్నవి ఊహాజనితమేనని వెంకయ్య వ్యాఖ్యానించారు.

Comments

comments