Search
Tuesday 26 September 2017
  • :
  • :
Latest News

లేడీస్ స్పెషల్… ‘వొడాఫోన్ సఖి’

Vodafone

‘వొడాఫోన్ సఖి’ పేరిట వొడాఫోన్ మహిళల కోసం ఓ ప్రత్యేక ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మహిళలు రీఛార్జీ కోసం వెళ్లినప్పుడు తమ మొబైల్ నెంబర్ చెప్పకుండానే రీఛార్జీ చేసుకునే సౌకర్యం ఉంటుంది. యుపి, ఉత్తరాఖండ్‌లలో మాత్రమే ఉన్నా ఈ ప్లాన్‌ను త్వరలోనే దేశవ్యాప్తంగా తీసుకొచ్చేందుకు వొడాఫోన్ చర్యలు చేపట్టింది.

రీచార్జీ చేసుకోవాలనుకున్నప్పుడు ‘ప్రైవేట్’ అని టైప్ చేసి 12604కి సందేశం పంపితే మీ ఫోన్‌కు ఒక ఒటిపి వస్తుంది. దాన్ని 24 గంటల్లోగా ఏదైనా రిటైల్ షాపులో చెప్పి తమ నెంబర్ చెప్పకుండానే రీఛార్జీ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు మహిళలు రీఛార్జీ కోసం వెళ్లినప్పుడు వారికి తెలియకుండా వాళ్ల నెంబర్ తెలుసుకొని వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దాంతో వొడాఫోన్ వ్యూహాత్మకంగా సఖి సౌకర్యంతో ముందుకు వచ్చింది.

Comments

comments