Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

బస్టాండు బాత్‌రూమ్‌లో ప్రసవించిన మహిళ

Baby-Killed

బాగల్‌కోట్: ఏడు నెలల గర్భిణీ బస్టాండు బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ పట్టణంలో చోటుచేసుకుంది. విజయపురా జిల్లా ముద్దిబిహాల్ పరిధిలోని గని గ్రామానికి చెందిన నిర్మల సిద్దేష్ అనే 27 ఏళ్ల మహిళ ఏడునెలల గర్భవతి. భర్త గోవాకు బదిలీ కావడంతో తల్లితో కలిసి నిర్మల తమ గ్రామానికి బయల్దేరింది. బస్సులో ప్రయాణిస్తూ లక్తల్ బస్టాండులోని బాత్ రూంకు వెళ్లిన నిర్మలకు అక్కడే హఠాత్తుగా పురిటి నొప్పులు వచ్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బాత్ రూంలోనే మరో మహిళ సాయంతో ప్రసవమైంది. దీంతో తల్లీ బిడ్డలను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

Woman gives birth to baby in Bus stand’s toilet in Karnataka.

Comments

comments