Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

దశవర్ష దిశ

హైదరాబాద్ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక రూపొందించాలి
30 ఏళ్ల అవసరాలకు అనువుగా పథక రచన : సిఎం

cm

హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక రూపొందించాలని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచి ప్రతి పని చేసుకుపోవాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాబో యే 30 ఏళ్లకు ఏర్పడే అవసరాలకు తగ్గట్లుగా ప్రణాళిక సిద్ధం చేయాలని, పదేళ్ల యాక్షన్‌ప్లాన్ తయారు చేయాలన్నారు. నగరం కోసం రెండు మంచినీటి రిజర్వాయర్లు నిర్మించడంతో పాటు రహదారులు, మురికి కాలువలు, వరద కాలువలు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధం, రవాణా సదుపాయాలు, మార్కెట్లు, టాయిలె ట్లు, పచ్చదనం తదితర అంశాల్లో నగరం ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించాలని చెప్పా రు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రగతిభవ న్లో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, టి.హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫజీయుద్ధీన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణ, నవీన్ మిత్తల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, జలమండలి కమిషనర్ దానకిషోర్, పిసిసిఎఫ్ పికె ఘా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ‘ హైదరాబాద్ నగరం శరవేగంగా పెరుగుతున్నది.

పెరిగే జనాభాకు తగ్గట్లుగా అవసరాలు కూడా పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెంచుకొని మనం ప్రణాళికలు వేయాలి. రాబోయే 30 ఏళ్లకు ఈ నగరం ఎలా ఉంటుంది, జనాబా ఎంత పెరుగుతుంది. అప్పుడు ఏర్పడే అవసరాలేంటి, ఎలా చేయాలి అని ఆలోచించాలి. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. కనీసం పదేళ్ల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. ఇప్పటి నుంచి చేసే ప్రతి పని ఆ ప్రణాళికలో భాగంగా ఉండాలని’ సిఎ నిర్ధేశించారు. ప్రజలకు నిరంతరం కరెంటు ఇవ్వడమే తొలి ప్రాధాన్యత ఇచ్చాం. ఇందులో విజయం సాధించాం. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రైతులకు సాగునీరు అందివ్వడం కోసం ప్రాజెక్టులు కడుతున్నాం. విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులు బాగా సాగుతున్నాయి. ఇక ప్రజలకు మౌళిక సదుపాయాలు అందించే విషయంలో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుంది. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో నివసింజే జనాభా విపరీతంగా పెరుగతుంది. దీనికి అనుగుణంగా వసతులు కల్పించాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే కోటి జనాభా ఉంది. దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ పోవాలి.’ అని సిఎం సూచించారు. హైదరాబాద్ మంచినీటి సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన రెండు రిజర్వాయర్లు నిర్మించాలి. గోదావరి నదిపై కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రిజర్వాయర్‌ను, కృష్ణా నదిపై కడుతున్న పాలమూరు ఎత్తిపోతల ద్వారా మరో రిజర్వాయర్‌ను నింపాలి. గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేసి, 10- నుంచి 15 టిఎంసిల నీరు నిల్వ ఉండే విధంగా రిజర్వాయర్లు నిర్మించాలి. దీని కోసం సాంకేతిక అంశాలను పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించాలి. నగరం కాంక్రీట్ జంగల్‌గా మారుతోంది. పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉంది. నగరం చుట్టూ ఉన్న వేలాది అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచాలి. నాగోల్, నారపల్లి ప్రాంతాల్లో దాదాపు ఏడెనిమిది వేల ఎకరాల అటవీ భూమి ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో రింగ్ రోడ్డు అవతర మరో 16 వేల ఎకరాల అటవీభూమి ఉంది. నర్సాపూర్, శిశంపేట ప్రాంతంలో దాదాపుగా 40 వేల ఎకరాల అటవీభూమి ఉంది. నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో అటవీభూమి ఉంది. వీటన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. వాటిని పెంచాలి.

ఔటర్ రింగ్‌రోడ్డు పొడవునా ఇరువైపులా వేప, గుల్మోర్, రావి చెట్లు నాటాలి. డిల్లీలో మాదిరిగా హైదరాబాద్‌లో పచ్చదనం ఉండాలి. మునిసిపల్ మంత్రి పేషీలో కేవలం పచ్చదనం పెంచే కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని ఓఎస్‌డిగా నియమించాలి. నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఇందుకోసం బస్తీ కమిటీలు వేయాలి. ప్రతి డివిజన్‌కు 10 కమిటీలు ఉండాలి. 15 రోజుల్లోగా కమిటీల నియామకం కావాలి. ప్రజలందరినీ కలుపుకొని బస్తీల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడడం తదితర విషయాల్లో ఆ కమిటీలు కీలకంగా పనిచేయాలి. గండిపేట, హిమాయత్‌సాగర్, శామీర్‌పేటతో పాటు నగరంలో, నగరం చుట్టూ అనేక చెరువులు ఉన్నాయి. వాటిలో పారిశ్రామిక వ్యర్ధాలు, ఇతర కాలుష్యం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మురికినీరు చెరువుల్లో చేరకుండా ప్రత్యేక కాలువలు నిర్మించాలి. నగరంలో కొత్తగా కట్టే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సందర్భంలో అధికారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. తప్పులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలి. మూసీ నదిలో మురికి నీరు చేరకుండా చూడాలి. మురికి నీరు పోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మూసీకి రెండు వైపులా ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలి. మూసీ మీదుగా ఓఆర్‌ఆర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు రహదారి నిర్మించాలి. మూసీ దాటడానికి పలు చోట్ల వంతెనలు నిర్మించాలి. ఎస్‌ఆర్‌డిపిల భాగంగా నిర్మించే పెట్టుకొని విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలి. ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా నిర్మించే రహదారుల విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఉప్పల్ లాంటి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అండర్‌పాస్‌లు నిర్మించే సందర్భంలో వర్షం, వరద నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు అవసరమైన సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలి.

Comments

comments