Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

బిఆర్‌డి ఆస్పత్రిలో మరణ మృదంగం

CHILD

లక్నో : యుపిలోని గోరఖ్‌పూర్‌లో ఉన్న బిఆర్‌డి  ప్రభుత్వ వైద్య కళాశాలలో మరణమృదంగం మోగుతోంది. ఈ కళాశాలలో చోటు చేసుకున్న ఘటనలో శనివారం తెల్లవారుజామున మరో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. దీంతో ఆగస్టు 9వ తేదీ నుంచి ఈ ప్రమాదం కారణంగా మృతి చెందిన చిన్నారుల సంఖ్య 33కి చేరింది. ఐదు రోజుల్లోనే ఈ ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో అప్పుడే పుట్టిన చిన్నారులు కూడా ఉండడం ప్రతిఒక్కరి మనస్సును కలిచివేస్తోంది. ఆక్సిజన్ అందక ఈ మరణాలు సంభవించాయి.

ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థకు బిఆర్‌డి ఆస్పత్రి రూ.70లక్షల మేర బకాయి పడింది. వాటిని చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా నిలిపివేసింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు ఆక్సిజన్ లేక చనిపోయారు. ఈ ఘటనపై యుపిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గోరఖ్‌పూర్ సిఎం సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఇటీవలే ఆయన బిఆర్‌డి ఆస్పత్రిని సందర్శించి, అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చిన కొన్ని రోజులకే ఈ ఆస్పత్రిలో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి.

33 Children Die in Gorakhpur’s BRD Hospital  Due to Oxygen Disruption

Comments

comments