Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుకు ఆధార్?

Aadhar

న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రతి దానికి ఆధార్‌ను అనుసంధానం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం కూడా ఇదే విధంగా చర్యలు చేపడుతోంది. తాజాగా మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయాలన్నా ఆధార్ నం బర్ తప్పనిసరి చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సంక్షేమ పథకాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డులు వంటి వాటికి ఆధార్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.  ఇక ఈ ఆధార్ స్టాక్‌మార్కెట్లోకి ప్రవేశించనుందని, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయాలన్నా కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మార్కెట్ లావాదేవీలకు కూడా ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ప్రభు త్వం, సెబీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఇటీవల సెబీ అనధికారింగా చర్చించినట్లు ఓ అధికారి తెలిపారు.

Comments

comments