Search
Tuesday 19 June 2018
  • :
  • :

సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా గౌతమి

GAUTAMI

ఢిల్లీ : దక్షిణాది నటి గౌతమి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యురాలిగా నియామకమైంది. సెన్సార్ బోర్డ్ చీఫ్‌గా ఉన్న పహ్లజ్ నిహ్లానీని తొలగించిన అనంతరం అతడి స్థానంలో ప్రసూన్ జోషిని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటీమణులు గౌతమి, జీవిత రాజశేఖర్, జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి విద్యాబాలన్, వివేక్ అగ్నిహోత్రి, టిఎస్ నాగభరన, వాణి త్రిపాఠి టికూ, నరేంద్ర కోహ్లీ, నరేష్ చంద్రలాల్, నీల్ హార్బర్ట్, వామన్ కేంద్రే, రమేష్ పతంగె వంటి ప్రముఖులను సెన్సార్ బోర్డు సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Actress Gauthami Appointed as Censor Board Member

Comments

comments