Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

కెసిఆర్ పాత్రలో ఆ బాలీవుడ్ నటుడు..?

CM-KCR

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, ‘పెళ్లిచూపులు’ మూవీ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ కావటంతో ప్రస్తుతం చిత్రబృందం నటీనటుల ఎంపిక మీద దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దాంతో అందరీ దృష్టి కెసిఆర్‌గా నటించే నటుడు ఎవరనేదానిపై పడింది.

గతంలో కెసిఆర్‌ పాత్రలో బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు పేరు వినిపించింది. అయితే తాజాగా మరో బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధీఖీ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో పలు విలక్షణమైన పాత్రల్లో నటించి మంచి పేరు పొందారు సిద్ధీఖీ. దీంతో చిత్రయూనిట్ నవాజుద్ధీన్ అయితే కెసిఆర్ పాత్రకు సరిగ్గా సరిపోతాడనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  కెసిఆర్ బయోపిక్కి అంతా సిద్ధం కావడంతో త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Comments

comments