Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

డ్రాగన్ కుతంత్రం..!

clash-between-Indian-and-Ch

లడఖ్: డ్రాగన్ మరోసారి కుతంత్రానికి పాల్పడింది. ఆగస్టు 15న లడఖ్ లో చైనా సైనికులు రెండుసార్లు చొరబాటుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టారు. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన చైనా ఆర్మీ అక్కడ గస్తీకాస్తోన్న ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటిబిపి) బలగాలపై రాళ్లు విసురుతూ, ఇనుపరాడ్లతో కొడుతూ బీభత్సం సృష్టించింది. అయితే అప్రమత్తమైన భారత బలగాలు సైతం రాళ్లు విసిరాయి. అంతేగాక పరస్పరం కాళ్లతో తన్నుకున్న దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకురావడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Comments

comments