Search
Monday 21 August 2017
  • :
  • :
Latest News

మాజీ ప్రధాని కాన్వాయ్ ఢీకొని బాలుడి మృతి

                 Boy-died

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ గుజ్రాత్ లో భారీ  ర్యాలీ తీస్తున్నప్పుడు ఆయన కాన్వాయ్‌ లోని ఓ వాహనం ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.  విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ పనామా పేపర్ లో ఆరోపణలు రావడంతో నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  ప్రజల మద్దతు కూడగట్టేందుకు షరీఫ్ దేశం అంతటా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గుజ్రాత్ లో జరిగే బహిరంగ సభకు హాజరయ్యేందుకు తన మద్దతుదారులతో లాహోర్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. లాలామూస వద్ద రోడ్డు దాటుతున్న బాలుడిని ఆయన కాన్యాయ్ లోన ఓ వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే బాలుడు మరణించాడు. షరీఫ్ బాలుడి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

.

Comments

comments