Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

జూదంగా మారిన.. జాదు విత్తనాలు !

6 ఎకరాల పత్తి పంట నష్టం
ముడుచుకున్న ఆకులు,రాలుతున్న పూలు,కాయలు
నట్టేట మునిగిన రైతు రాజ్యానాయక్
ఆత్మహత్యే శరణ్యమంటున్న బాధితుడు
రైతును ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్

                           Jadoo

అచ్చంపేట : జాదు విత్తనాలనే కొనండి అంటూ ఆ కంపెనీ ప్రక టనలు విన్నాడో లేక పట్టణంలోని ఫర్టిలైజర్ యజమాని అంటగడితే తీసుకవెళ్ళా డో తెలియదు కాని అదే కంపెనీ విత్తనాలు కోనుగోలు చేసిన ఓ రైతు 6ఎకరాల వ్యవసాయ పత్తి పంటను సాగుచేసి నిండా మునిగిన సంఘటన శనివారం బల్మూ ర్ మండలం బాణాల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గత రెండు నెలల క్రితం అచ్చంపేట పట్టణానికి చెందిన శ్రీలక్ష్మివెంకటేశ్వర ఫర్టిలైజర్ దుకాణం యజమాని బాలకృష్ణ వద్ద ఇస్లావత్ సుక్యాపేరుతో రూ.4000 బిల్లు తీసుకోని రూ.1600విలువ గల జాదు విత్తనా లు,రూ. 2400 విలువ గల విజయ విత్తనాలను కోనుగోలు చేసిన్నట్లు రైతు కేతా వత్ రాజ్యానాయక్ తెలిపారు.

గత నెల రోజుల నుండి ఏపుగా పెరిగిన ప్రత్తి పం ట పూర్తిగా ఆకులు ముడుచుకోని పూలు కాయలు రాలి గిటక బారింది. అనుమా నం వచ్చిన రైతు అచ్చంపేటకు వచ్చి ఫర్టిలైజర్ యజమానితో వాగ్వాదానికి దిగా డు. ప్రత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతు రాజ్యా బోరున విలపించారు. నట్టేన ముంచిన జాదు ప్రత్తి పంటను చూసి రైతు దిగాలు చెందాడు. తన వెంట తెచ్చిన జాదు ప్రత్తి పంటను స్థానిక విలేకర్లకు చూయించి బోరున విలపించారు. అక్కడి నుండి అచ్చంపేట డివిజన్ వ్యవసాయ శాఖ ఇంఛార్జి సహాయ సంచాలకు లు కృష్ణమొహాన్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. బల్మూర్ ఎఓ మహేష్‌ను వెంట నే పంట పరిస్థితిని అంచనా వేసి కావాల్సిన మందులను పిచికారి చేయించాల్సీందిగా ఆయన ఆదేశిం చారు.

తాత్కాలి కంగా త్రిబుల్ 19 అనే మందును పిచికారి చేయడం వల్ల నష్టాన్ని కొంత వరకు పూడ్చుకోవచ్చని ఆయన అన్నారు.ఇ దే విషయం పై దుకాణం యజ మాని బాలకృష్ణను వివరణ కోరగా కలుపు మొక్కల మందు పిచికారి చేసి ఉంటే ఇలాం టి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఎలాం టి మందులు పిచికారి చేయలేదని కేవలం జాదు విత్తనాలు వాడడం వల్లే ఇలాంటి నష్టం వాటిల్లి ందని రైతులు ఆరోపించా రు.అచ్చంపేట అన్నదాత ఫర్టిలైజర్ యజమాని మల్లా రెడ్డి సహా చుట్టు ప్రక్కల పోలాల రైతులు వచ్చి బాదితుడిని ఓ దార్చారు.పంట సా గు చేసిన అప్పులు తీరక ఆత్మహాత్యే శరణమని రైతు రాజ్యా ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే బాదిత రైతును ఆదు కోవాలని గ్రామస్తులు రాంజ్య, చంద్యా,శ్రీనివాసులు,వెంకటయ్య డిమాండ్ చేశారు.

ప్రత్తి పంటను పరిశీలిస్తాం ..

రైతు నష్ట పోయిన జాదు,విజయ విత్తనాల ప్రత్తి పంటను పరీశి లిస్తామని అచ్చం పేట వ్యవసాయ శాఖ ఇంచార్జి సహాయ సం చాలకులు కృష్ణమొహాన్ స్పష్టం చేశా రు.ఈ ప్రాంతంలో ఇలాం టి పంట నష్టం ఎప్పుడు జరుగలేదని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలోని భూత్పుర్ మండలంలో ఇలాంటి నష్టాలు సర్వసాధా రణంగా జరుగుతుంటాయని ఆయన అన్నారు.పోలాన్ని సందర్శించి జరిగిన నష్టం ఉన్నతా ధికారులతో చర్చిస్తామని ఆయన అన్నారు.అప్పటికి తెలియక పొతే శాస్త్రవేత్తల దృష్టికి తిసుక వెళ్ళడం జరుగుతుందన్నారు. బాదిత రైతును ప్రభుత్వం ఆదుకోవా లని ఆయన అన్నారు.
కృష్ణమొహాన్,ఇంఛార్జి
ఎడిఎ,అచ్చంపేట.

Comments

comments