Search
Wednesday 21 February 2018
  • :
  • :

బంగ్లా ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం

Dhaka-airport

ఢాకా: బంగ్లాదేశ్ అంతర్జాతీయ విమానశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్యాలయంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దేశంలోనే విమాన సౌకర్యం ఉన్న ప్రధాన హజ్రత్ షహజలాల్ అంతర్జాతీయ విమానశ్రయంలో మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన విమానశ్రయ అగ్నిమాపక సిబ్బంది విభాగాలు రెండు గంటలపాటు శ్రమించినంతరం మంటలను అదుపులోకి వచ్చాయని పౌరవిమానయాన అధికార ప్రతినిధి రిజౌల్ కరీం వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.

విమాన సర్వీసులు సాయంత్రం 4 గంటల తరువాత పునఃప్రారంభమయ్యాయని చెప్పారు.  ఈ ఘటనకు వెనక గల కారణాలను కనుగొనేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీతో అంతర్గత విచారణకు అధికారులు ఆదేశించారు. విచారణపై ఏడు రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదంతో విమానాల రాకపోకల షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడలేదన్నారు. నిజానికి ఎయిర్‌ఇండియా కార్యాలయంలోని రెండవ అంతస్తు విమానశ్రయ టెర్మినల్1, ఖతార్ ఎయిర్‌వేస్ కార్యాలయాలకు మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు.

Fire at Shahjalal originated from Air India office, Dhaka airport.

Comments

comments