Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

ప్రియురాలి కోసం … పోలీసులకు బెదిరింపులు

LOVE

ఢిల్లీ : తన ప్రియురాలి కోసం ఓ ప్రియుడు పోలీసులనే బెదిరించాడు. ఓ యువతి తన ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని తుపాకితో కాల్చి హత్య చేసింది. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రియురాలిని అరెస్టు చేసిన పోలీసులను ఆమె ప్రియుడు బెదిరించడం మొదలు పెట్టాడు. రాజస్థాన్‌కు చెందిన ఇందుబాల, వినోద్ బేణివాల్ మాజీ ప్రేమికులు, అతడిని వదిలించుకునే ఉద్దేశంతో ఆమె తన ప్రియుడు దీపక్ మాలిక్‌తో కలిసి జులై 31న వినోద్‌ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలీసులు విచారణలో ఇది హత్యగా తేలడంతో ఇందుబాలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు ఫేస్‌బుక్‌లో పోస్టుల ద్వారా పోలీసులను బెదిరించడం మొదలు పెట్టాడు. ఇందుబాలతో తప్పుగా నడుచుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తన పోస్టుల్లో హెచ్చరించాడు. పరారీలో ఉన్న నిందితుడు దీపక్ వివిధ ప్రాంతాల నుంచి ఫేస్‌బుక్ పోస్టులు పెడుతున్నాడని, త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

For the girlfriend … threats to the police

Comments

comments