Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

షార్ట్ సర్క్యూట్: ఒకే ఇంట్లో నలుగురి మృతి

                   FIRE-ACCIDENT

లక్నో: ఉత్తర ప్రదేశ్  రాష్ట్రం జాన్ పూర్ జిల్లా బర్సాత్ లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్  తో నలుగురు మృతి చెందారు. కరెంట్ షాక్ కారణంగా  ఇంటికి నిప్పంటుకోవడంతో అందులో నివసిస్తున్న తల్లి తో సహా ముగ్గురు చిన్నారులు సజీవదహనమయ్యారు. గాడ నిద్రలో ఉన్నప్పుడు మంటలు చెలరేగడంతో ఎటు తప్పించుకోలేని పరిస్థితిలో వాళ్లు మంటల్లో కాలి బూడిదయ్యారు.  దీంతో దౌడపూర్ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారు కుసుమ్ (28), అంజలి(7), అన్షిక(5), అయుషి(2)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Comments

comments