Search
Monday 11 December 2017
  • :
  • :

ఫారెస్ట్ పరీక్షలకు ఉచిత శిక్షణ

                          Study-Circle

హైదరాబాద్: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫిసర్ పోటీ పరీక్షలు రాయనున్న ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనార్టీ అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఆసక్తి కలిగిన మైనార్టీ అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 12లోపు దరఖాస్తులను స్వీకరిస్తామని, 15వ తేదీలోపు అడ్మిషన్ పొందాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ స్టడీ సర్కిల్ డైరక్టర్ ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరింత సమాచారం నిమిత్తం 04023236113/ 9059547211 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. అలాగే ఎస్‌సి,ఎస్‌టి, బిసి అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో (studycircle.cgg.gov.in)దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉప సంచాలకులు వి.సముజ్వల తెలిపారు. సెప్టెంబర్ 21 నంచి అక్టోబర్ 20 వరకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె పేర్కొన్నారు. భద్రాచలం, వరంగల్, ఉట్నూర్, పిఇటిసి, హైదరాబాద్‌లలో శిక్షణకు తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు. మరిన్ని వివరాలకు 04027540104 నెంబర్‌ను సంప్రదించాలని సముజ్వల తెలిపారు.

Comments

comments